AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: వైరల్ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఓ సారి తులసి, అల్లం వాడి చూడండి..

సాధారణంగా చలి కాలంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధకతకు అంతరాయం కలుగుతుంది. వీటి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముక్కు, గొంతు,..

Winter Health: వైరల్ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఓ సారి తులసి, అల్లం వాడి చూడండి..
Tulsi Zinger Benefits
Ganesh Mudavath
|

Updated on: Oct 29, 2022 | 1:54 PM

Share

సాధారణంగా చలి కాలంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధకతకు అంతరాయం కలుగుతుంది. వీటి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముక్కు, గొంతు, నాడీ, జీర్ణ సమస్యలు సర్వసాధారణమైపోతాయి. దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణమయ్యే అనేక అంశాలు ఉన్నాయి. అయితే వీటి బారిన పడ్డాక చాలా మంది ఆస్పత్రులకు వెళ్తుంటారు. వైద్యులు సూచించిన మందులను వేసుకుంటుంటారు. అయితే చికిత్స కన్నా నివారణ మేలు అన్నట్లుగా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకముందే కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. తులసి.. చలికాలం వస్తున్నందున ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో సహాయపడే అత్యంత శక్తివంతమైన మూలికలలో తులసి ఒకటని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది దగ్గును తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లివర్ డిటాక్స్ సపోర్టును అందిస్తుంది. తులసిలో వైరస్‌తో పోరాడే అనేక యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.

అల్లం.. ఇందులో జింజెరాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అల్లంలోని యాంటీ-మెడిసినల్ లక్షణాలు ప్రభావవంతంగా నిరూపితమయ్యాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పిని అరికట్టడంలో చక్కగా ఉపయోగపడతాయి. తులసి, అల్లం, తేనె ను తగినంత పరిమాణంలో మిక్స్ చేసుకుని ఉపయోగిస్తే మంచి లాభాలు ఉంటాయి. ఈ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులను త్వరగా నయం చేయడానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.

తులసి లో ఉండే ఔషధాలు ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి సహాయపడుతుంది. ఆయుర్వేద మూలికలలో కాల్షియం, విటమిన్లు ఎ, సి, జింక్, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడం సులభం అవుతుంది. మూలికలను నీటిలో ఉడకబెట్టి, ఆపై తేనెతో సేవించవచ్చు. లేదా టీ రూపంలో తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!