AP Government: ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు

Subhash Goud

Subhash Goud |

Updated on: Oct 29, 2022 | 6:32 AM

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. పేదల ఇళ్లకోసం ఆర్‌-5 పేరిట స్పెషల్‌ జోన్‌ ఏర్పాటు చేస్తూ..

AP Government: ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు
Andhra CM YS Jagan

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. పేదల ఇళ్లకోసం ఆర్‌-5 పేరిట స్పెషల్‌ జోన్‌ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. సీఆర్‌డీఏ చట్ట సవరణలో భాగంగా ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల కోసం స్పెషల్‌ జోన్‌ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. రాజధాని పరిధిలోని ఐదు గ్రామల్లో 900.97 ఎకరాల్లో పేదల ఇళ్ల కోసం జోనింగ్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్​విడుదల చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఉంటుందని చెప్పింది. తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

స్పెషల్‌జోన్‌ మార్పుల మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌లోనూ మార్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. జోనింగ్‌లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సలహాలకు 15 రోజుల గడువిచ్చింది. నవంబరు 11 వరకు సీఆర్డీఏ కార్యాలయం, ఈ మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అటు రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది. దానికి అనుగుణంగానే పేదల ఇళ్లస్థలాల కోసం స్పెషల్‌జోన్‌పై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu