Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamahendravaram: రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మరిన్ని గ్రామాల విలీనం.. బోర్డు మీటింగ్‌లో స్పెషల్‌ ఫోకస్‌

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మరిన్ని గ్రామాలు విలీనం కానున్నాయి. కొత్త గ్రామాల విలీనంపైనే రుడా బోర్డు మీటింగ్‌లో స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. రాజమహేంద్రవరం..

Rajamahendravaram: రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మరిన్ని గ్రామాల విలీనం.. బోర్డు మీటింగ్‌లో స్పెషల్‌ ఫోకస్‌
Rajamahendravaram
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2022 | 7:24 AM

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మరిన్ని గ్రామాలు విలీనం కానున్నాయి. కొత్త గ్రామాల విలీనంపైనే రుడా బోర్డు మీటింగ్‌లో స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్‌ అథారిటీ మాస్టర్‌ప్లాన్‌పై సర్కారు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రుడా బోర్డు మీటింగ్‌లో కొత్తగ్రామాల విలీనంపైనే ప్రత్యేకంగా చర్చించారు. మొదటి, రెండు బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. భవిష్యత్‌లో రాజమహేంద్రవరం మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడంతో మరిన్ని గ్రామాలను అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో విలీనం చేసేందుకు బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే కార్పొరేషన్‌ పరిధిలోకి రానున్న మండలాలు, గ్రామాలపై ఓ నిర్ణయానికి వచ్చింది.

రాజానగరం, గోపాలపురం నియోజకవర్గాల నుంచి కొన్ని మండలాలు రుడా పరిధిలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చినట్లు చెప్పారు రుడా చైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి. ఆ మండలాలతోపాటు రామచంద్రాపురం, సఖినేటిపల్లి, మలికిపురం ప్రాంతాలను సైతం రుడా పరిధిలో చేర్చడంపై చర్చించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆయా ప్రతిపాదనలకు అనుగుణంగా గ్రామాలను విలీనం చేస్తే రుడా పరిధి మరింతగా పెరుగుతుందన్నారు.

కొవ్వూరు, నిడదవోలు మాస్టర్‌ ప్లాన్‌కు రేపోమాపో ప్రకటన విడుదల చేస్తామన్నారు షర్మిలారెడ్డి. ప్రకటనపై వచ్చే అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి