Nothing Ear: నథింగ్ నుంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్… డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
లండన్‌కు చెందిన నథింగ్ బ్రాండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఐఫోన్‌ను పోలి ఉన్న దీని డిజైన్, బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో..
లండన్‌కు చెందిన నథింగ్ బ్రాండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఐఫోన్‌ను పోలి ఉన్న దీని డిజైన్, బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్రాండ్ నుంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వచ్చాయి. భారత మార్కెట్లోకి అందుబాటులోకి నథింగ్ ఇయర్ (స్టిక్) పేరుతో లాంచ్ చేసిన ఈ ఇయర్ బడ్స్ తొలి సేల్ నవంబర్ 17 నుంచి ప్రారంభంకానుంది. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు..
నథింగ్ ఇయర్ (స్టిక్)లో 12.6 ఎంఎం డ్రైవర్స్ అందించారు. వీటి ద్వారా యూజర్లు స్పష్టమైన క్లారిటీతో సౌండ్‌ను ఆస్వాదించొచ్చు. కేవలం 4.4 గ్రాముల బరువుతో మాత్రమే రూపొందించిన ఈ ఇయర్ బడ్స్‌లో బేస్ లాక్, క్లియర్ వాయిస్ వంటి టెక్నాలజీని అందించారు. ఇయర్ బడ్స్‌పైనే మ్యూజిక్‌ను ప్లే, పాజ్, స్కిప్ చేసుకునే బటన్స్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే వీటి ద్వారా నాన్‌స్టాప్‌గా ఏడు గంటలు, 3 గంటలు మ్యూజిక్ టాక్‌టైమ్‌ను పొందొచ్చు.
Float away. With a powerfully authentic sound experience.
Pre-order Ear (stick) now at https://t.co/GTvKcyj8Ic#EarStick pic.twitter.com/gmjFujDM20
— Nothing (@nothing) October 26, 2022
ఇక ధర విషయానికొస్తే నథింగ్ ఇయర్ (స్టిక్) భారత్‌లో రూ. 8,499కి అందుబాటులో ఉంది. భారత్‌తో పాటు 40 దేశాల్లో నవంబర్ 17 నుంచే ఈ ఇయర్ బడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్ బడ్స్ అందుబదటులోకి రానున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..