WhatsApp: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త ఫీచర్.. తీరనున్న ఆ ఇబ్బందులు..

వాట్సప్ వినియోగదారులకు ఆ సంస్థ త్వరలో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వాట్సప్ వినియోగదారులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకనుంది. ఇమేజ్‌, వీడియోలతో పాటు టెక్స్ట్‌ ఉన్నప్పుడు..

WhatsApp: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త ఫీచర్.. తీరనున్న ఆ ఇబ్బందులు..
Whatsapp Impact
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 28, 2022 | 12:34 PM

వాట్సప్ వినియోగదారులకు ఆ సంస్థ త్వరలో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వాట్సప్ వినియోగదారులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకనుంది. ఇమేజ్‌, వీడియోలతో పాటు టెక్స్ట్‌ ఉన్నప్పుడు ఆ మెసేజ్‌ల ఫార్వర్డ్‌ విషయంలో వస్తున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సప్ ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా వాట్సాప్‌ లో ఫొటోలు, వీడియోలు ఒకరి నుంచి మరొకరి ఫార్వర్డ్‌ చేయడం చాలా ఈజీ. అయితే ఫొటో లేదా వీడియోతో పాటు టెక్స్ట్‌ కూడా వస్తే.. దానిని ఫార్వర్డ్‌ చేయడం కష్టం. టెక్ట్స్ మెసేజ్‌ తో ఉన్న ఇమేజ్ లేదా వీడియోను ఫార్వర్డ్‌ చేస్తే కేవలం ఇమేజ్‌ లేదా వీడియో మాత్రమే వెళ్తుంది. దీంతో మళ్లీ ఆ మెసేజ్‌ టెక్స్ట్‌ను టైప్‌ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌ వినియోగదారులు ఎంతో కాలంగా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సమస్యకు పరిష్కారం తీసుకురానుంది వాట్సాప్‌.

టెక్స్ట్‌ మెసేజ్‌తోపాటుగా ఇమేజ్‌, వీడియోను ఫార్వర్డ్‌ చేయాలంటే ఆండ్రాయిడ్‌లో కొన్ని టిప్స్ పాటించి చేయొచ్చు కానీ.. ఐవోఎస్‌లో అసాధ్యం. ఆండ్రాయిడ్‌లో షేర్‌ ఆప్షన్‌ ద్వారా రెండూ ఫార్వర్డ్‌ చేయొచ్చు. అయితే త్వరలో అలాంటి ఇమేజ్‌ లేదా వీడియో ఫార్వర్డ్‌ చేస్తే మొత్తంగా వెళ్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ పనిచేస్తోంది. బీటా యూజర్లు కొంతమందికి ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని రకాల తనఖీలు పూర్తి చేసుకుని.. అంతా ఓకే అనుకుంటే ఈ ఫీచర్‌ను రెగ్యులర్‌ యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు.

అందుబాటులోకి మరికొన్ని ఫీచర్లు

వాట్సాప్‌లో త్వరలో మరికొన్ని ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే డిజైన్లలో మాత్రమే మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూపుల్లో ఇప్పటివరకు ఆ మెసేజ్‌ పెట్టిన వారి పేరు, నెంబరు మాత్రమే కనిపిస్తోంది. త్వరలో వాళ్ల డీపీను కూడా చూపించనున్నారు. అదే విధంగా ఫొటోలను పంపేముందు వాటిని బ్లర్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆప్షన్లు కూడా టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. త్వరలో వాట్సప్ వినియోగదారులకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!