WhatsApp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను గమనించారా.? దీని ఉపయోగం ఏంటో తెలుసా.?
వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వాట్సాప్ సర్వర్ డౌన్ అయినప్పుడు ఎంతటి చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అంతలా వాట్సాప్ జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను..
వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వాట్సాప్ సర్వర్ డౌన్ అయినప్పుడు ఎంతటి చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అంతలా వాట్సాప్ జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే దీనికి కారణం. ఇప్పటికే సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ పలు ఆసక్తికర ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది.
గూగుల్ మీట్, జూమ్, స్కైప్ వంటి గ్రూప్ కాలింగ్ ఫీచర్‌లో భాగంగా లింక్ క్రియేట్ ఆప్షన్ ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ లింక్ సహాయంతో గ్రూప్ కాల్‌ను క్రియేట్ చేస్తే ఇతరులతో పంచుకోవడం ద్వారా గ్రూప్ కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఈ ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఈ ఫీచర్‌ను పరియం చేసింది. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే..
ఇందుకోసం ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి కాల్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఇలా ఓపెన్ చేయగానే వెంటనే పైన ‘క్రియేట్ కాల్ లింక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్రియేట్ లింక్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కాల్ టైప్ సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది. వీడియో లేదా వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం షేర్ లింక్, కాపీ లింక్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ అవసరానికి అనుగుణంగా లింక్‌ను ఇతరులతో షేర్ చేయాలి. అవతలి వ్యక్తులు సదరు లింక్‌పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ కాల్‌లో జాయిన్ అవ్వొచ్చు. ఒక్కసారి క్రియేట్ చేసిన గ్రూప్ కాల్ లింక్‌ను 90 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..