Apple Iphone: ఐఫోన్ యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఛార్జింగ్ సమస్యలకు ఫుల్‌స్టాప్..
యాపిల్ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా అదో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఐఫోన్‌ను ఎలాగైనా మొదటి రోజు సొంతం చేసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. కొన్ని సందర్భాల్లో...
యాపిల్ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా అదో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఐఫోన్‌ను ఎలాగైనా మొదటి రోజు సొంతం చేసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి కిడ్నీలు కూడా అమ్ముకున్నారనే వార్తలను చదివే ఉంటాం. టెక్నాలజీ రంగంలో అంతలా తనదైన ముద్ర వేసిందీ యాపిల్ బ్రాండ్. అయితే ఐఫోన్‌లో ఎక్కడలేని ఫీచర్లు ఉన్నా.. ఛార్జింగ్ విషయంలో మాత్రం యూజర్లు నిరాశతో ఉంటారు. కారణం.. యాపిల్ సంస్థ ప్రత్యేకంగా చార్జర్లు ఇవ్వకపోవడం అలాగే, ఐఫోన్‌లకు ఇతర కంపెనీలకు చెందిన పిన్‌లు కూడా సెట్ కాకపోవడమే.
అయితే తాజాగా ఈ సమస్యకు చెక్ పడనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ నుంచి భవిష్యత్తులో వచ్చే ఐఫోన్15లో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు లైటింగ్ పోర్ట్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. యూరోపియన్ చట్టం ప్రకారం 2024 నాటికి అన్ని ఫోన్‌లను కచ్చితంగా యూఎస్‌పీ టైప్ – సి పోర్టుతోనే తయారు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అన్ని కంపెనీల ఫోన్‌లు ఒకే తరహా ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉండాలనేది చట్టం సారాంశం. ఈ నేపథ్యంలోనే యాపిల్ కూడా ఇదే నిబంధనలను ఫాలో కానుంది.
ఈ విషయమై యాపిల్ సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగి గ్రెగ్ జోస్వియాక్ మాట్లాడుతూ.. ‘నిస్సందేహంగా మేము యూరోపియన్ యూనియన్ తెచ్చిన చట్టానికి కట్టుబడి ఉంటాము’ అని చెప్పుకొచ్చారు. అయితే ఐఫోన్‌లు టైప్ – సి కేబుల్‌తో వస్తాయని చెప్పినప్పటికీ కేవలం యూరప్‌లో తయారయ్యే ఫోన్‌లకే ఇది వర్తిస్తుందా లేదా ఇతర దేశాల్లో తయారయ్యే ఫోన్‌లకు కూడా వర్తిస్తుందా అన్న దానిపై జోస్వియాక్ స్పష్టతనివ్వలేదు. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లన్నీ టైప్-సి కేబుల్‌తో ఉన్నవే. అయితే ఐఫోన్‌ల కేబుల్స్ వేరే రకంగా ఉండడంతో వీరు ఛార్జింగ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా యాపిల్ ఛార్జర్‌ల ధరలు కూడా భారీగా ఉండడం యూజర్లకు ప్రతికూల అంశంగా చెప్పొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..