Apple Watch: చిన్నారి ప్రాణాలను రక్షించిన యాపిల్ వాచ్.. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి..
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలిపే ఓ పరికరం అంతే. కానీ ఇప్పుడు వాచ్‌కు అర్థమే మారిపోయింది. స్మార్ట్ వాచ్‌ల రాకతో అన్ని మారిపోయాయి. కాల్స్ నుంచి మెసేజ్‌ల వరకు, హార్ట్‌బీట్ నుంచి శరీరంలో ఆక్సిజన్ స్థాయిల వరకు అన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది..
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలిపే ఓ పరికరం అంతే. కానీ ఇప్పుడు వాచ్‌కు అర్థమే మారిపోయింది. స్మార్ట్ వాచ్‌ల రాకతో అన్ని మారిపోయాయి. కాల్స్ నుంచి మెసేజ్‌ల వరకు, హార్ట్‌బీట్ నుంచి శరీరంలో ఆక్సిజన్ స్థాయిల వరకు అన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. మీ గుండె సరిగ్గా కొట్టుకుంటోందా.? రక్త ప్రసరణ సరిగ్గానే ఉందా.? ఆక్సిజన్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి.? ఇలా అన్ని విషయాలను తెలియజేస్తూ యూజర్లను అలర్ట్ చేస్తున్నాయి. అంతేనా వ్యాధులను ముందస్తుగానే గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాపిల్ కంపెనీ వాచ్‌లు ఇందులో ముందు వరుసలో ఉంటున్నాయి.
మొన్నటి మొన్న ఓ మహిళ తాను గర్భవతిననే విషయాన్ని యాపిల్ వాచ్ ఇచ్చిన కమాండ్స్ ఆధారంగానే తెలుసుకుంది. హార్ట్‌బీట్‌లో అబ్‌నార్మల్‌గా ఉందని వాచ్ అలర్ట్ చేయడంతో సదరు మహిళ కరోనాగా భావించి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, ప్రెగ్నెంట్ అని అసలు విషయం తేలింది. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. యాపిల్ వాచ్ అమెరికాకు చెందిన ఓ చిన్నారి ప్రాణాలను కాపాడింది. అమెరికాకు చెందిన ఇమానీ అనే 12 ఏళ్ల చిన్నారి యాపిల్ వాచ్‌ను ఉపయోగిస్తోంది. అయితే ఇటీవల ఆమె గుండె కొట్టుకునే వేగంలో అనూహ్యమార్పు కలిగింది.
దీంతో ఆ అమ్మాయి ధరించిన యాపిల్ వాచ్ ఆగకుండా బీప్‌మని శబ్ధంతో అలర్ట్ చేసింది. అంతేకాకుండా గుండె వేగం సరిగా లేదని అలర్ట్ చేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అపెండిక్స్‌లో కణితి ఉన్నట్టు తేలింది. పిల్లల్లో అరుదుగా వచ్చే ఈ క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించడంతో దాన్ని సర్జరీ చేసి తొలగించాలని వైద్యులు నిర్ధారించారు. వ్యాధిని ముందస్తుగానే గుర్తించడం వల్ల ప్రమాదాన్ని తప్పించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..