AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఈ నెల 31న వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల సమావేశం.. జనసేనాని వ్యాఖ్యలపై చర్చించే అవకాశం!

వైసీపీలో ఉన్న కాపు కులానికి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనను పదే పదే అసభ్యంగా విమర్శిస్తే ఇక నుంచి ఊరుకునేది లేదంటూ.. ఏకంగా వైసీపీలో ఉన్న కాపుల లీడర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. 

Andhra Pradesh: ఈ నెల 31న వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల సమావేశం.. జనసేనాని వ్యాఖ్యలపై చర్చించే అవకాశం!
Ycp Kapu Leaders
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 1:28 PM

Share

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా..వైసీపీ జనసేన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను అధికార వైసీపీ పార్టీ నుంచి కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనలు ఆ రెండు పార్టీల మధ్య మరింత అగ్గిని రాజేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. వైసీపీలో ఉన్న కాపు కులానికి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనను పదే పదే అసభ్యంగా విమర్శిస్తే ఇక నుంచి ఊరుకునేది లేదంటూ.. ఏకంగా వైసీపీలో ఉన్న కాపుల లీడర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సమావేశంకానున్నట్లు తెలుస్తోంది.

అవును అధికార వైసీపీ పార్టీలో ఉన్న కాపు నేతల గురించి తాజాగా పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈనెల 31వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని ఓ హోటల్‌లో వైఎస్‌ఆర్‌ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి ఏపీలో ఉన్న మొత్తం వైఎస్‌ఆర్‌ సీపీ కాపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

తాము వైసీపీ పార్టీ కోసం 12-13 ఏళ్ళుగా కష్టపడి పనిచేసి, వివిధ పదవులను చేపట్టామని.. తమను తోటి కాపు కులస్థుడైన పవన్ కళ్యాణ్ అవమానిస్తే.. మిగతా కులాల వారు ఏ విధంగా చూస్తారన్న కనీస ఆలోచన, స్పృహ లేదా అని కొందరు కాపునేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే వైసీపీ కాపు లీడర్స్ సమావేశాన్ని జనసేనాని ఏ కోణంలో చూస్తారు.. దీనిని రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎలా తిప్పి కొడుతారన్న అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..