Budda venkanna: బుద్దా వెంకన్న షుగర్ లెవెల్స్ డౌన్.. నిరవధిక దీక్షను భగ్నం చేసిన పోలీసులు

దీక్ష చేస్తున్న వెంకన్న షుగర్ లెవల్ డౌన్ కావడంతో ఆస్పత్రి కి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో పోలీసులు బలవంతంగా బుద్దా వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Budda venkanna: బుద్దా వెంకన్న షుగర్ లెవెల్స్ డౌన్.. నిరవధిక దీక్షను భగ్నం చేసిన పోలీసులు
Budda Venkanna
Follow us
Surya Kala

|

Updated on: Oct 29, 2022 | 6:52 AM

టీడీపీ నేత బుద్దా వెంకన్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు బుద్ధ వెంకన్న దీక్షను భగ్నం చేసి.. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  వైద్యులు తో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష చేస్తున్న వెంకన్న షుగర్ లెవల్ డౌన్ కావడంతో ఆస్పత్రి కి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో పోలీసులు బలవంతంగా బుద్దా వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అయితే ఆయన్ని ఆసుపత్రికి తరలించే సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులకు అడుగడుగునా అడ్దకున్నారు.

గత రెండు రోజుల క్రితం టీటీడీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖకు బయలుదేరిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యకి నిరసనగా మొన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇంటి వద్దే బుద్దా వెంకన్న నిరవధిక దీక్షకు దిగారు. వెంకన్న దీక్షకు పలువురు టీడీపీ నేతలు , ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు,కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..