Spam Calls: స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారా.? ఈ సింపుల్‌ ట్రిక్స్ ఫాలో అయితే సరి..

ఏ చిన్న పనికైనా ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్‌ చేసుకోవాలనుకున్నా, ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలన్నా వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే మన ఫోన్‌ నెంబర్లను కొందరు మిస్‌ యూజ్‌ చేస్తూ స్పామ్‌ కాల్స్‌కి..

Spam Calls: స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోతున్నారా.? ఈ సింపుల్‌ ట్రిక్స్ ఫాలో అయితే సరి..
How To Stop Spam Calls
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 28, 2022 | 6:38 PM

ఏ చిన్న పనికైనా ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్‌ చేసుకోవాలనుకున్నా, ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలన్నా వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే మన ఫోన్‌ నెంబర్లను కొందరు మిస్‌ యూజ్‌ చేస్తూ స్పామ్‌ కాల్స్‌కి ఉపయోగిస్తుంటారు. స్పామ్‌ కాల్స్‌లో ముఖ్యంగా టెలీమార్కెటింగ్‌ కాల్స్‌, రోబో కాల్స్‌, స్పామ్‌ కాల్స్‌ అని మూడు రకాలు ఉంటాయి.

స్పామ్‌ కాల్స్‌లో కొన్ని వినియోగదారులను మోసం చేసేవే ఉంటాయి. కాల్స్‌ చేస్తూ యూజర్లను తప్పు దారి పట్టిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌ ఇప్పిస్తాము, జాబ్‌ ఆఫర్స్‌ ఉన్నాయి అంటూ రకరకాలుగా ప్రజలను మభ్యపరుస్తుంటారు. అయితే ఇలాంటి కాల్స్‌ రాకుండా ఉండడానికి ఆండ్రాయిడ్‌ ఓ సెక్యూరిటీ ఫీచర్‌ను అందించింది. ఇందులో భాగంగా కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్‌ అనే రెండు ఫీచర్లను గూగుల్‌ అందిస్తోంది. వీటి ద్వారా యూజర్లు స్పామ్‌ కాల్స్‌ నుంచి బయటపడొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..

ఇందుకోసం ముందుగా ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని, దాన్ని ఎనేబుల్ నొక్కాలి. అనంతరం అగ్రీ బటన్‌పై క్లి్‌క్‌ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది. ఇక మరో ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి.. ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, దాని నుంచి మీకు మరోసారి ఫోన్‌కాల్స్‌ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.