CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆరోగ్య శ్రీలో మరిన్ని వైద్య సేవలు.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్..

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆరోగ్య శ్రీలో మరిన్ని వైద్య సేవలు.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్..
CM Jagan
Follow us

|

Updated on: Oct 28, 2022 | 6:33 PM

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్ర, సేవా రత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఆరోగ్య శ్రీలో చేరిన వైద్య చికిత్సలు ఇవే..

మే 2019లో ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్య కేవలం 1,059గానే ఉండగా..  ఆ చికిత్సలను క్రమంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అయితే ఇదే అంశాలన్ని మరోసారి పెంచుతూ.. జనవరి 2020లో 2059కి తీసుకొచ్చారు. అంతేకాదు వైద్యం ఖర్చుల కింద రూ.1000 పైబడ్డ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత కూడా ఆరోగ్య శ్రీ స్కీంలో మరికొన్ని మార్పులు చేశారు. జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్లు తెచ్చింది. అయితే నవంబర్‌ 2020లో ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే రోగాల సంఖ్య 2,436కు పెంచారు. ఇందులో బోన్‌ మ్యారోతో పాటు 235 ప్రొసీజర్లను చేర్చడంతో ఎంతో మందికి సాయం అందించనట్లుగా మారింది. మే-జూన్‌ 2021లో 2,446కు ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య పెరగగా.. 10 కోవిడ్‌ ప్రొసీజర్లను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చారు. 2022లో ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే వ్యాదుల సంఖ్యను 3,255కు పెంచారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!