Tirumala Tirupati Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల టైమింగ్స్‌లో మార్పులు..
టీటీడీ పాలక మండలి ప్రయోగాత్మక నిర్ణయాలను తీసుకుంది. తాజాగా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు..
టీటీడీ పాలక మండలి ప్రయోగాత్మక నిర్ణయాలను తీసుకుంది. తాజాగా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. డిసెంబర్ ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్చుతున్నట్టు చెప్పారాయన. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు చైర్మన్ వైవీ. ఇక నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శన టైం స్లాట్ దర్శన టోకెన్లు జారీ చేస్తామని అన్నారాయన. అలిపిరి దగ్గర యాభై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన బైక్ పార్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు వైవీ.
తర్వాత తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు జారీ చేస్తామని అన్నారు. టికెట్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని అన్నారు. క్షురకులపై నిఘా సిబ్బంది పెట్టలేదనీ.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో నిఘా విభాగం ఉన్నది అవినీతి అరికట్టేందుకేనని అన్నారాయన. క్షురకుల ధర్నా వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారనీ. భక్తులను ఇబ్బంది పెట్టిన వారిపై చర్య తీసుకుంటామని అన్నారు ఈవో.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..