AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: శనివారం రాశి ఫలాలు.. ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేసే అవకాశం..

తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 29వ తేదీ )శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: శనివారం రాశి ఫలాలు.. ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేసే అవకాశం..
Horoscope Today
Surya Kala
|

Updated on: Oct 29, 2022 | 6:29 AM

Share

Horoscope Today (29-10-2022):  ఈ రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 29వ తేదీ )శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కొన్ని కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన సందర్భాల్లో శ్రమ పెరగకుండా సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. బంధు, మిత్రులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషన్ని పంచుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ఈజీగా పూర్తి చేస్తారు.  బంధువులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక ధన వ్యయం చేస్తారు. ప్రతిభకు తగిన పనితీరుతో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబంలో అభిప్రాయం బేధాలు రానీయకండి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న దానికంటే అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఎవ్వరితోనూ విభేదించకండి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు పెద్దల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముందుకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.  బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల వైఖరి మీపట్ల మిశ్రమంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని  శుభ ఫలితాలను పొందుతారు. మానసిక బలంతో ముందుకు సాగుతారు. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ వాతావరణం  అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లభిస్తాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. సొంత విషయాలపై ఇతరుల ప్రభావం పడకుండా ఉండాల్సి ఉంటుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలను అందుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం వదిలి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషముగా ఉంటారు.  బంధుమిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!