Zodiac Signs: మీ రాశిని బట్టి మీ వ్యక్తిత్వం ఏ జంతువు ఆత్మని పోలి ఉంటుండి.. మీ రాశి స్వభావం ఏమిటో తెలుసుకోండి..

మనిషి ఆత్మ .. అంతర్గత లక్షణాలు.. జంతువు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతారు.  మీ రాశిచక్రం ఆధారంగా మీ వ్యక్తిత్వం ఏ జంతువు ఆత్మను పోలి ఉంటుందో.. మీ రాశిని బట్టి.. మీ  అంతరాత్మకు నచ్చిన జంతువు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Zodiac Signs: మీ రాశిని బట్టి మీ వ్యక్తిత్వం ఏ జంతువు ఆత్మని పోలి ఉంటుండి.. మీ రాశి స్వభావం ఏమిటో తెలుసుకోండి..
Zodiac Sign
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2022 | 1:59 PM

మనిషికి జంతువులకు అవినాభావ సంబంధం ఉందని ప్రాచీన కాలం నుంచి నమ్మకం. ఈ నేపథ్యంలో మనిషి ఆత్మ .. అంతర్గత లక్షణాలు.. జంతువు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతారు.  మీ రాశిచక్రం ఆధారంగా మీ వ్యక్తిత్వం ఏ జంతువు ఆత్మను పోలి ఉంటుందో.. మీ రాశిని బట్టి.. మీ  అంతరాత్మకు నచ్చిన జంతువు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. మేష రాశి: చిరుత: ఈ రాశివారు వ్యక్తిత్వం చిరుతని పోలి ఉంటుందట. వీరి ఆత్మ  చిరుత లక్షణాలు కలిగి ఉండి.. అవకాశం, పట్టుదల, అవసరమైనప్పుడు త్వర పడే తత్వాన్ని సూచిస్తుంది. ఒక చిరుత వేట సమయంలో తన కళ్ల ఎలా కేంద్రీకరించి దాడి చేస్తుందో.. అదే లక్షణాలు ఈ రాశి వ్యక్తి కలిగి ఉంటారట. ఈ రాశి వ్యక్తులు తమ లక్ష్యాలను, కలలను గురించి నిర్భయంగా వెల్లడిస్తారు.
  2. వృషభం: ఎలుగుబంటి: ఎలుగుబంటి .. రాజు వంటి గుణాలను కలిగి ఉంటుంది. రక్షణ , స్థిరత్వాన్ని సూచిస్తుంది. మీ జీవితంలో ఇవి అత్యంత విలువైన లక్షణాలుగా కీర్తించబడతాయి. ఈ రాశివారు ఎల్లప్పుడూ దృఢమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. తాము నమ్మిన దాని కోసం నిలబడతారు. ఎలుగుబంటి తన పిల్లలను రక్షించినట్లే.. మీరు తన  ప్రియమైన వారిని నిస్వార్థంగా రక్షిస్తారు.
  3. మిథునం: నక్క: నక్క మాదిరిగానే. ఈ రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. నక్క అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా ఎలా తెలివిగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడుతుందో.. అదే విధంగా ఈ రాశివారు కష్ట కాలంలో కూడా తెలివిగా వ్యవహరించి తమ జ్ఞానంతో బయటపడతారు.
  4. కర్కాటకం: కుందేలు: కుందేళ్ళ వలె.. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంచి ప్రేమికులు. చాలా సౌమ్యంగా ఉంటారు. తమకు , తమ చుట్టూ ఉన్న ఇతరులకు ఎటువంటి సమస్యలను సృష్టించకుండా ఉంటారు.  కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు భద్రత, చాలా సున్నిత తత్వం వీరి సొంతం.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం: సింహం: ఈ రాశివారు గుణం సింహం మాదిరిగానే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యమైన సింహరాశివారు సొంతం. సింహం గంభీరమైనది. అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అన్నింటా ఆధిపత్యం చెలాయించడానికి ఇష్టపడతారు.
  7. కన్య రాశి: పిల్లి: జ్యోతిషశాస్త్రంలో ఈ రాశివారు పిల్లి ఆత్మను పోలివుంటారు. వీరు తెలివైనవారు. అప్రమత్తంగా ఉంటారు. స్వీయ శోషణ,  చమత్కారంగా ఉంటారు.  చాలా  పరిశుభ్రంగా ఉంటారు. తాము ఉన్న ప్రాంతాలను ఎల్లపుడూ శుభ్రంగా ఉంచుతారు.
  8. తులారాశి- హంస: హంసల మాదిరి తులారాశి వారి వ్యక్తిత్వం చాలా ఉల్లాసంగా గంభీరంగా ఉంటుంది. హంస అందం, సామరస్యం, దయను సూచిస్తుంది. ఇవన్నీ తులారాశి అధిదేవత శుక్రుని లక్షణాలు. అలాగే  హంసలు తులారాశిలాగే ప్రేమ, ఐక్యత, భాగస్వామ్యానికి ప్రతీక.
  9. వృశ్చికం-పాము: పాములు మానవుల నేచర్ కు భిన్నంగా ఉంటాయి. ఈ వృశ్చికరాశి కూడా బయటకు ఒకలా అందరికీ కనిపిస్తారు. తప్పుగా అర్ధం చేసుకుంటారు. వీరు చాలా కఠినులని, ఎన్నో రహస్యాలు దాచుకునే వ్యక్తులుగా కనిపిస్తారు. అయితే వీరు మనసు లోతులో తరచి చూస్తే.. చాలా ప్రేమ, శ్రద్ధ ఆసక్తికరమైన వ్యక్తులు.
  10. ధనుస్సు-గుడ్లగూబ: ధనుస్సు రాశివారు గుడ్లగూబ వలె తెలివైనవారు. శోభాయమానంగా, గంభీరంగా ఉంటారు. గుడ్లగూబలు శాంతియుతంగా, నిశ్శబ్దంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి బలమైన అంతర్గత శక్తిని కలిగి ఉంటాయి. తమకు కష్టం ఎదురైతే..వాటిని ఎదుర్కొంటారు. ధనుస్సు రాశి అగ్ని సంకేతం.. దీంతో ఈ రాశివ్యక్తులు మంచి అభిరుచి , ఆశయాన్ని కలిగి ఉంటారు.
  11. మకరం-బాతు: బాతు వలెనే మకర రాశివారు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. వీరు గుంపులో గోవిందంగా జీవించడానికి ఇష్టపడరు.. తమ కంటూ  సొంత మార్గం ఏర్పరచుకుని ఆ మార్గంలో కొనసాగాలని కోరుకుంటారు. ఈ రాశివారు అత్యంత గర్వించదగిన లక్షణం మంచి తెలివితేటలు
  12. కుంభం-డాల్ఫిన్లు: డాల్ఫిన్లు మానసిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. డాల్ఫిన్లు జ్ఞానం, కొత్త అవకాశాలు, అదృష్టానికి ప్రతీక. పురోగతి, మేధస్సు , ఆవిష్కరణ కూడా కుంభరాశి  ముఖ్య లక్షణాలు.
  13. మీనం-ఊసరవెల్లి: మీన రాశి వ్యక్తులు ఊసరవెల్లి వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి. ఊసరవెల్లి ప్రకృతికి అనుగుణంగా ఎలా తన రంగు మార్చుకుంటూ ఉంటుందో.. అదే విధంగా ఈ రాశి వ్యక్తులు పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతారు. అంతర్ దృష్టి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమ నిజస్వరూపాలను దాచుకోవడంలో వీరిద్దరూ సిద్ధహస్తులు.  మీన రాశి వ్యక్తుల కదలికను అంచనా వేయడం కష్టం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)