AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారట.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 28వ తేదీ )శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారట.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Oct 29, 2022 | 6:00 AM

Share

Horoscope Today (28-10-2022):  ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 28వ తేదీ )శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు  మిశ్రమ కాలం. కొన్ని కీలక పనుల్లో ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుగోలుకి ప్రయత్నాలు చేస్తారు. శుభకాలం.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు  చేపట్టిన పనులను ఈజీగా పూర్తి చేస్తారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల మన్నన పొందుతారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు ధన లాభం పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో  ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలను పాటించడం మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ముందడుగు పడుతుంది.  బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం. శుభ ఫలితాలు కలుగుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు చేయాల్సి వస్తుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. పని తీరుతో అందరి ప్రశంసలను అందుకుంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మానసికంగా సుఖశాంతులతో గడుపుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్త వింటారు. ప్రశంసలు అందుకుంటారు.  ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదా..? ఆర్బీఐ ఊరట
గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేదా..? ఆర్బీఐ ఊరట
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు