- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti never forget these things of chanakya every obstacle will be overcome
Chanakya Niti: ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం మీ సొంతం అంటోన్న చాణక్య
ఆచార్య చాణక్యుడు తమ నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి మనుగడకు సంబంధించిన చాలా విషయాలు ప్రస్తావించాడు. వీటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ఆచార్య చాణక్యుడు కూడా ఒక వ్యక్తి ఎప్పటికీ మరచిపోకూడని కొన్ని విషయాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు.
Updated on: Oct 28, 2022 | 1:12 PM

అసూయతో ఉండే వ్యక్తులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని అస్సలు చూడలేరు. మీరు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అనేక అడ్డంకులను సృష్టిస్తారు. అందుకే వీరిని దరిచేరనివ్వొద్దని చాణుక్యుడు తెలిపాడు.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.

భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.

గౌరవం: చాణక్యుడి నీతి ప్రకారం, గౌరవం మనుషుల మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగేలా చేస్తుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, సంబంధం వెలసిన దుస్తులా మారుతుంది. గౌరవం ఉన్న సంబంధం ఆనందం ముగుస్తుంది. ప్రతి బంధానికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ దాటకూడదు.

వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు. ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.





























