AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagula Chavithi: నాగుల చవితి జరుపుకోవడంలో భిన్న వాదనలు.. నేడా..! రేపా..! పండితులు ఏమి చెబుతున్నారంటే..

ఈ ఏడాది అన్ని పర్వదినాలు వచ్చినట్లే.. రెండు రోజులు చవితి తిథి వచ్చింది. అక్టోబర్ 28వ తేదీ , అక్టోబర్ 29 వ తేదీ చవితి తిథి ఉంది. 28-10-2022 శుక్రవారం చవితా? లేదా 29-10-2022 శనివారం చవితిని జరుపుకోవాలా అనే సందేహం అందరి మదిలోనూ కలుగుతుంది.

Nagula Chavithi: నాగుల చవితి జరుపుకోవడంలో భిన్న వాదనలు.. నేడా..! రేపా..! పండితులు ఏమి చెబుతున్నారంటే..
Nagula Chavithi 2022
Surya Kala
|

Updated on: Oct 29, 2022 | 9:38 AM

Share

కార్తీక మాసం శివకేశవుల పూజకే కాదు.. సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైన మాసం. కార్తీక మాసంలోనే కార్తికేయ పేరుంది. దీపావళి తర్వాత వచ్చే చవితి రోజుని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈరోజు పుట్టలో పాలు పోసి.. సుబ్రహ్మణ్య స్వామిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ నాగుల చవితిని  మహా  చతుర్ధి అని కూడా అంటారు. అయితే ఈ ఏడాది అన్ని పర్వదినాలు వచ్చినట్లే.. రెండు రోజులు చవితి తిథి వచ్చింది. అక్టోబర్ 28వ తేదీ , అక్టోబర్ 29 వ తేదీ చవితి తిథి ఉంది. 28-10-2022 శుక్రవారం చవితా? లేదా 29-10-2022 శనివారం చవితిని జరుపుకోవాలా అనే సందేహం అందరి మదిలోనూ కలుగుతుంది. ఈ నేపథ్యంలో నాగుల చవితి జరుపుకోవడంలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నారు పండితులు.

కొందరు.. శుక్రవారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 12:35 నిమిషాల చవితి తిథి రానున్నది. దీంతో సూర్యోదయంకి లేని చవితి పనికి రాదు.. కనుక కార్తీక శుద్ధ చవితి.. శనివారం వచ్చిందని.. నాగులచవితిని శనివారం జరుపుకోవాలని కొంతమంది పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు ఉదయం 7:40 నుంచి 10:20 నిమిషాల లోపు పుట్టలో పాలు పోయ్యవల్సి ఉంటుందని.. ఇది శుభ సమయమని చెబుతున్నారు.

మరికొందరు.. సాధారణంగా చవితి మధ్యాహ్నం వరకు ఉన్న సమయంలో నాగదేవత ఆరాధన చేయాలి. ఈ నేపథ్యంలో ఈరోజు చవితి తిథి మధ్యాహ్నం ఉంది.  చవితి తిథి ఈరోజు సుమారు 11.00 లకు కానున్నదని.. చవితి తిథి రేపు ( అక్టోబర్ 29, 2022న) ఉదయం  08:13  ముగుస్తుంది కనుక ఈరోజు నాగుల చవితి పండగ జరుపుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నాగుల చవితి రోజున పుట్ట దగ్గర కు వెళ్లి.. పచ్చి చలిమిడి, చిమిలి, ఆవు పాలు, పూలు, పళ్లు తీసుకుని వెళ్లారు. పాము పుట్టలో పాలు పోసి.. నాగదేవతను ఆరాధిస్తారు. కొంతమంది చిన్న పిల్లలు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగిస్తారు.

దేశమంతట పలు దేవాలయల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోతాయని.. రాహు కుజ దోషాలు తొలగిపోతాయని.. పెండ్లి కావాల్సిన యువతులు నాగుల చవితిరోజున పుట్టలో పాలు పోస్తే.. త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, చెవి ,చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)