విషాదం: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. మృతి చెందిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు ఐఏఎన్‌ఎస్ నివేదించింది. భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. మృతి చెందిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
మృతులు పావని వరంగల్ వాసిగా గుర్తించారు. ప్రేమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వాసిగా తెలిసింది. మరోకరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన సాయి నరసింహులుగా గుర్తించారు.
తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఉత్తరం వైపు వెళ్తున్న కారు, దక్షిణం వైపు వెళ్తున్న వాహనం ఢీకొన్నాయి. కారులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు 23 ఏళ్ల మనోజ్ రెడ్డి దొండ, 22 ఏళ్ల శ్రీధర్ రెడ్డి చింతకుంట, 23 ఏళ్ల విజిత్ రెడ్డి గుమ్మల, 22 ఏళ్ల హిమ ఈశ్వర్య సిద్దిరెడ్డిని బెర్క్‌షైర్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్నవారిని అంతర్జాతీయ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. ఆరుగురు న్యూ హెవెన్ విశ్వవిద్యాలయంలో ఒకరు సేక్రేడ్ హార్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు.
మరోవాహనంలోని డ్రైవర్ ఒక్కడే ఉన్నట్టుగా తెలిసింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి కారు ఓనర్‌గా తెలిసింది. అతడు కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మెడికల్ సెంటర్‌కు తరలించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి