Kanye West: అనుచిత వ్యాఖ్యలకు భారీ మూల్యం.. ఒక్కసారిగా పడిపోయిన పాప్ సింగర్ బ్రాండ్ వాల్యూ..
కొన్నిసార్లు సెలబ్రిటీలు తెలిసో, తెలియకో చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను, జాతిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తుంటాయి. ఈ కారణంగా తమ పేరు, ప్రఖ్యాతలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే..
కొన్నిసార్లు సెలబ్రిటీలు తెలిసో, తెలియకో చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను, జాతిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తుంటాయి. ఈ కారణంగా తమ పేరు, ప్రఖ్యాతలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ర్యాపర్ కేన్ వెస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
కేన్ వెస్ట్ ఇటీవల జ్యూదు సమాజానికి సంబంధించి పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఒక్కసారిగా జనాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కేన్ వెస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆడిడాస్ కంపెనీకి చెందిన సబ్‌బ్రాండ్ అయిన యీజీ కంపెనీకి చెదిన షూలను తగలబెట్టి నిరసన తెలిపాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఏకంగా రూ. 12 లక్షల విలువైన షూలను కాల్చేసి తన నిరసనను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A Florida man burned his 40-pair Yeezy collection to protest Kanye’s anti-semitic comments ? pic.twitter.com/F1RJ4xV37N
— Nice Kicks (@nicekicks) October 27, 2022
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంతో కేన్ వెస్ట్ బ్రాండ్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఆయనతో ఒప్పంద చేసుకున్న పలు కంపెనీలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. జేపీ మోర్గాన్, బాలెన్సియాగా కంపెనీలు కేన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్ స్థానం నుంచి తొలగించేశాయి. వీటి విలువ కొన్ని రూ. వేల కోట్లని సమాచారం. ఒక్క యీజీ బ్రాండ్‌తోనే కేన్స్‌కు 1.3 బిలియన్ డాలర్ల ఒప్పందం ఉండడం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..