AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaina Boy: చెల్లికి లెక్కలు నేను చెప్పలేను.. ఎన్ని సార్లు చెప్పినా తప్పు చేస్తోందని ఏడుస్తున్న అన్న.. అది నేనే అంటోన్న నెటిజన్లు..

వీడియోలో పిల్లవాడు ఏడుస్తున్నట్లు చూడవచ్చు. పిల్లవాడిని అతని తల్లి వీడియో తీసినట్లు తెలుస్తోంది. తాను చెల్లికి లెక్కలు చెప్పలేనని.. టీచర్ ను కాలేనంటూ ఏడుస్తూ చెబుతున్నాడు. చిత్రంలో మూడు లంబకోణాలు ఉన్నాయి

Chaina Boy: చెల్లికి లెక్కలు నేను చెప్పలేను.. ఎన్ని సార్లు చెప్పినా తప్పు చేస్తోందని ఏడుస్తున్న అన్న.. అది నేనే అంటోన్న నెటిజన్లు..
China Boy Video Viral
Surya Kala
|

Updated on: Oct 28, 2022 | 12:52 PM

Share

గణితం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అందుకనే విద్యార్థి దశలో గణిత శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అయితే చాలామంది లెక్కలు అదొక మిస్టరీ సబ్జెక్ట్ గా భావిస్తారు. అయితే గణితం అభ్యసించడానికి రెండు విషయాలు చాలా అవసరం. మంచి ఉపాధ్యాయుడు.. గొప్ప విద్యార్థి కలిస్తే.. గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయవచ్చు మేథ్స్ లో.. అయితే మాథ్స్‌లో చాలా రకాల లెక్కలు సాల్వ్ చేయలేని స్టూడెంట్స్ పై టీచర్స్ కోపం వ్యక్తం చేస్తారు. ఏ స్టూడెంట్ అయినా తాను బోధించిన దానికి అర్థం చేసుకోకపోతే.. ఆ ఉపాద్యాయుడు కలత చెందడం సాధారణం. అదే సమయంలో.. తాను ఎన్ని సార్లు ఎంత చెప్పినా విద్యార్థికి అర్ధం కాకపోతే.,, ఆ టీచర్ విసుగుచెందుతాడు. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఉపాధ్యాయుడు కోపం వస్తే.. స్టూడెంట్ ఏడుపు ప్రారంభించాడు. ఈ వీడియో చైనాకు చెందినదిగా తెలుస్తోంది.

చైనా కు చెందిన ఓ అన్న తన చెల్లెలికి గణితం బోధిస్తున్నారు. త్రిభుజం గురించి తన చెల్లెలికి వివరించి విసిగిపోయినట్లు ఉన్నాడు. అయినప్పటికీ ఆ  చెల్లెలికి ఏమీ అర్థం కాలేదు. చెప్పి చెప్పి విసిగిన అన్న కాసేపటి తర్వాత చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. గణితాన్ని అర్థం చేసుకోవడంలో సమస్య వారు బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఏముంది? చైనాకు చెందిన ఈ వీడియోలో తన చెల్లికి లెక్కలు అర్థం అవ్వడం లేదు.. దీంతో ఒక బాలుడు త్రిభుజం గురించి వివరిస్తూనే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో ‘పాపం రిలేటబుల్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయబడింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 12.5 లక్షల లైక్స్ వచ్చాయి.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

వీడియోలో పిల్లవాడు ఏడుస్తున్నట్లు చూడవచ్చు. పిల్లవాడిని అతని తల్లి వీడియో తీసినట్లు తెలుస్తోంది. తాను చెల్లికి లెక్కలు చెప్పలేనని.. టీచర్ ను కాలేనంటూ ఏడుస్తూ చెబుతున్నాడు. చిత్రంలో మూడు లంబకోణాలు ఉన్నాయి. అయితే చెల్లి.. మాత్రం రెండు లంబ కోణాలు ఉన్నాయని పదే పదే నొక్కి చెబుతోంది. అంటూ టీచర్ గా మారిన అన్న ఏడుస్తుంటే.. మరోవైపు స్టూడెంట్ చెల్లి కూడా ఏడుస్తూనే లెక్కలు సాల్వ్ చేస్తోంది. ఇదంతా చూసిన ఆ పిల్లల తల్లి తన నవ్వు ఆపుకోలేక పోతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో పలువురి నెటిజన్లను ఆకర్షించింది. చాలా మంది చాలా ఫన్నీ అంటూ కామెంట్ చేశారు. అవును ‘గణితం నిజంగా మిమ్మల్ని ఏడ్పిస్తుంది.. అని ఆంటే ఆ ‘అబ్బాయి సరిగ్గా నాలాగే ఉన్నాడు’ అని మరొరు కామెంట్ చేశారు. ‘నాకు బోధించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు అదే విధంగా బాధపడాలి’ అని మరొకరు తనకు లెక్కలంటే ఉన్న ఫీలింగ్ ను చెప్పకనే చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..