Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IVF Treatment: క్యాన్సర్ బారిన పడిన బాయ్ ఫ్రెండ్.. 26 ఏళ్ల క్రితం డిపాజిట్ చేసిన స్మెర్మ్ తో తల్లి కావాలన్న గర్ల్ ఫ్రెండ్ కోర్కెను తీర్చిన వైనం..

పీటర్ ఫుట్‌బాల్ ఆటగాడు. క్యాన్సర్ బారిన పడ్డాడు. దీంతో అతను సహజంగా తండ్రి కాలేకపోయాడు. అయితే 26 ఏళ్ల క్రితం డిపాజిట్ చేసిన స్పెర్మ్ తో ఇప్పుడు తండ్రి అయ్యాడు. పీటర్ గర్ల్ ఫ్రెండ్ ఆరెలిజా.. పీటర్ బిడ్డకు జన్మనిచ్చింది.

IVF Treatment: క్యాన్సర్ బారిన పడిన బాయ్ ఫ్రెండ్.. 26 ఏళ్ల క్రితం డిపాజిట్ చేసిన స్మెర్మ్ తో తల్లి కావాలన్న గర్ల్ ఫ్రెండ్ కోర్కెను తీర్చిన వైనం..
Ivf Treatment
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2022 | 9:07 AM

ఏ కాలంలోనైనా.. ఏ దేశంలోనైనా ప్రతి స్త్రీకి సంతానం ఒక వరంగా భావిస్తుంది. అయితే కొన్ని కారణాల వలన స్త్రీలు సంతానం పొందక పొతే.. వెంటనే  IVF సాంకేతికతను ఆశ్రయిస్తున్నారు. ఈ పద్దతి ద్వారా సంతానం లేని దంపతులు కూడా ఇప్పుడు పిల్లలను పొందుతున్నారు. కొన్ని శారీరక సమస్యల కారణంగా తల్లిదండ్రులు కాలేని వారికి ఈ టెక్నిక్ ఆశద్వీపంగా మారింది. ఈ టెక్నిక్ సహాయంతో..  ఒక ఆటగాడు 26 సంవత్సరాల తర్వాత తన స్వంత స్పెర్మ్ సహాయంతో తండ్రి అయ్యాడు. వినడానికి ఇది కాస్త వింతగా అనిపించినా ఇది పూర్తిగా నిజం.

ఇంగ్లండ్‌లోని కోల్‌చెస్టర్ ఎసెక్స్‌లో చోటు చేసుకుంది ఈ వింత ఘటన. పీటర్ హిక్లస్  26 ఏళ్ల క్రితం తన 21 ఏళ్ల వయసులో డాక్టర్ కోరిక మేరకు స్పెర్మ్‌ను డిపాజిట్ చేశాడు. ఇప్పుడు అదే శాంపిల్ ద్వారా తండ్రి అయ్యాడు. అక్టోబరు 20న పీటర్,  అతని కాబోయే భార్య 32 ఏళ్ల ఆరెలిజా తమ బిడ్డకు స్వాగతం పలికారు. సి సెక్షన్ ద్వారా పుట్టిన పాప ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఇదే విషయంపై స్పందిస్తూ.. ది సన్ తో తన సంతోషాన్ని పంచుకున్నాడు పీటర్. తాను ఓ బిడ్డకు తండ్రి అయ్యాడంటే నమ్మలేకపోతున్నానని ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు.

పీటర్ ఫుట్‌బాల్ ఆటగాడు. క్యాన్సర్ బారిన పడ్డాడు. దీంతో అతను సహజంగా తండ్రి కాలేకపోయాడు. అయితే 26 ఏళ్ల క్రితం డిపాజిట్ చేసిన స్పెర్మ్ తో ఇప్పుడు తండ్రి అయ్యాడు. పీటర్ గర్ల్ ఫ్రెండ్ ఆరెలిజా.. పీటర్ బిడ్డకు జన్మనిచ్చింది. పీటర్ 1996లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ తనకు ట్యూమర్ ఉందని తెలిసిందని చెప్పాడు. ఈ కణితి హాడ్జికిన్స్ లింఫామ్ వల్ల ఏర్పడింది. ఇది ఒక ప్రమాదకరమైన క్యాన్సర్. ఇందుకోసం కీమోథెరపీ చేయించుకోవాలని డాక్టర్‌ సూచించారు. అయితే ట్రీట్మెంట్ కు ముందు డాక్టర్లు పీటర్ స్పెర్మ్ నమూనాను స్టోర్ చేయమని కోరారు. ఎందుకంటే.. కీమోథెరపీ   చికిత్స పూర్తయిన తర్వాత పీటర్ స్పెర్మ్ కౌంట్ సున్నా అవుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాలక్రమంలో పీటర్ జీవితంలోకి అరేలిజా వచ్చింది. దీంతో పీటర్ కు జీవితంపై మళ్ళీ ప్రేమ కలిగింది. ఇద్దరూ సంతోషముగా జీవించడం ప్రారంభించారు.  ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఒక రోజు గర్ల్ ఫ్రెండ్ అరేలిజా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే పీటర్ కు  తన స్పెర్మ్ శాంపిల్‌ గుర్తుకొచ్చింది. వెంటనే తనకు క్యాన్సర్ చికిత్స చేసిన డాక్టర్‌ని పిలిచాడు. స్పెర్మ్  26 ఏళ్ల తర్వాత కూడా పని చేసే స్థితిలో ఉందని.. వైద్యులు చెప్పారు. దానిని లండన్‌లోని ‘యూనివర్శిటీ కాలేజ్ హాస్పిటల్’లో ఉంచామని వైద్యులు చెప్పారు. దీని తర్వాత స్పెర్మ్‌ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆరెలిజా అండాశయంలోకి చేర్చారు. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. ఈ మొత్తం ప్రక్రియలో 28 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు చిన్నారి పాపకు తల్లిదండ్రులుగా సంతోషాన్ని పొందుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
ఐసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
ఐసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు!
DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు!
టీబీజేపీ కొత్త బాస్ ఎంపికకు కౌంట్‌డౌన్! రేసులో ఉన్నది వీరేనా..
టీబీజేపీ కొత్త బాస్ ఎంపికకు కౌంట్‌డౌన్! రేసులో ఉన్నది వీరేనా..