UP Police: హెల్మెట్ అడిగిన పాపానికి దాష్టీకం.. నడిరోడ్డుపై పోలీసును చితకబాదిన నలుగురు యువకులు

నలుగురు యువకులు హెల్మెట్ లేకుండా బైక్ మీద ప్రయాణిస్తున్నారు. దీంతో హెడ్ కానిస్టేబుల్‌ ఆ నలుగురు యువకులను అడ్డగించినట్లు ఉన్నది. దీంతో ఆ  మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు హెడ్ కానిస్టేబుల్ ను నడి రోడ్డుమీద దారుణంగా కొట్టారు

UP Police: హెల్మెట్ అడిగిన పాపానికి దాష్టీకం.. నడిరోడ్డుపై పోలీసును చితకబాదిన   నలుగురు యువకులు
Up Police
Follow us

|

Updated on: Oct 28, 2022 | 11:46 AM

దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయేవారు కొందరు అయితే.. అవయవాలను కోల్పోతున్నవారు మరికొందరు. అయితే చాలావరకూ ప్రాణాలు కోల్పోతున్నవారు హెల్మెట్ ను ధరించకపోవడం వల్లనే అని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. అందుకనే వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ నింబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు వాహనదారులకు పోలీసులు, ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే చాలామంది బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించడానికి ఇష్టపడడం లేదు..  వీరి తీరును గమనించిన అధికారులు జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయినా మార్పు రావడం లేదు. అంతేకాదు మరొకొందరు.. పోలీసులపై తిరిగి దాడి కూడా చేస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నలుగురు యువకులు హెల్మెట్ లేకుండా బైక్ మీద ప్రయాణిస్తున్నారు. దీంతో హెడ్ కానిస్టేబుల్‌ ఆ నలుగురు యువకులను అడ్డగించినట్లు ఉన్నది. దీంతో ఆ  మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు హెడ్ కానిస్టేబుల్ ను నడి రోడ్డుమీద దారుణంగా కొట్టారు. ఇదే విషయాన్నీ పోలీసు అధికారులు గురువారం తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

పోలీసుని కొడుతున్న యువకులు 

వీడియోలో, నలుగురు వ్యక్తులు హెడ్ కానిస్టేబుల్‌ను కొట్టడం, దుర్భాషలాడడం కనిపిస్తుంది. ఈ దాడిపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ రాజ్ స్పందిస్తూ..  “హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను పారా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అడ్డుకున్నాడు. అయితే ఆ నలుగురు యువకులు హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. రోడ్డు మీద వెంబడించి వెంబడించి కొట్టారు. దీంతో ఆ యువకులపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. నిందితులను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..