Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Jupiter: స్కూటీ కోసం రూ. 10 క్యాయిన్స్ తో షో రూమ్ కి చేరుకున్న యువకుడి.. చెమటలు కక్కిన షో రూమ్ సిబ్బంది

వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి ప్రశాంతంగా కుర్చీపై కూర్చున్నట్లు కనిపిస్తుండగా.. ఒక వ్యక్తి.. టేబుల్‌పై నాణేలను లెక్కించడం కనిపిస్తుంది. రుద్రాపూర్‌లోని మమ్మీ టీవీ ఎస్ జూపిటర్ స్కూటర్ షోరూమ్ లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.

TVS Jupiter: స్కూటీ కోసం రూ. 10 క్యాయిన్స్ తో  షో రూమ్ కి చేరుకున్న యువకుడి.. చెమటలు కక్కిన షో రూమ్ సిబ్బంది
Rudrapur Man Buy Tvs Jupite
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 28, 2022 | 3:30 PM

చినుకు చినుకు కలిసి వరదగా మారి సముద్రం నిండుతుంది. ఈ సామెతను మనం ఎప్పటినుండో వింటూనే ఉంటాం. అయితే ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో నివసించే యువకుడు ఈ సామెతను కొంచెం సీరియస్‌గా తీసుకున్నాడు. వాస్తవానికి ఈ యువకుడు 50 వేల రూపాయలతో స్కూటీ కొనడానికి వచ్చాడు. ఆ యువకుడు ఆ మొత్తాన్ని కౌంటర్‌లో ఉంచడంతో షాప్ లోని సిబ్బంది తో సహా అందరూ షాక్ తిన్నారు. మరి ఆ యువకుడు షాప్ కి తెచ్చింది.. 10 నాణేలు. తాను పోగుచేసిన రూ.10 నాణేలతో స్కూటీ కొనేందుకు యువకుడు వచ్చాడు. స్కూటీ కొనేందుకు నాణేలన్నీ బ్యాగ్‌లో నింపుకుని టీవీఎస్ డీలర్ షోరూమ్‌కు యువకుడు చేరుకున్నాడు. ఆ తర్వాత ఈ 10 నాణేలతో స్కూటీ కొన్నాడు.

అయితే షోరూం ఉద్యోగుల నాణేలు లెక్కపెట్టేందుకు చెమటలు కక్కారు అనుకోండి. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. జూపిటర్ స్కూటీని కొనుగోలు చేసేందుకు యువకుడు 50 వేల రూపాయలతో షోరూమ్‌కు చేరుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి ప్రశాంతంగా కుర్చీపై కూర్చున్నట్లు కనిపిస్తుండగా.. ఒక వ్యక్తి.. టేబుల్‌పై నాణేలను లెక్కించడం కనిపిస్తుంది. రుద్రాపూర్‌లోని మమ్మీ టీవీ ఎస్ జూపిటర్ స్కూటర్ షోరూమ్ లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అక్కడ బైక్ కొనడానికి 50 వేల రూపాయలు చెల్లించడానికి ఒక వ్యక్తి పది  రూపాయల నాణేలతో చేరుకున్నాడు. అప్పుడు షోరూమ్ ఉద్యోగులు కూడా తల పట్టుకున్నారు. అయితే షాప్ లోని ఓ వ్యక్తి .. ఆ యువకుడి కోరిక.. అతడి కృషిని అతడు ఆ నాణేలను సేకరించడం కోసం పడిన కష్టాన్ని గౌరవించాడు. ప్రశాంతంగా ఆ నాణేలను లెక్కించడానికి కూర్చున్నాడు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి స్కూటీ ఇచ్చారు.

వైరల్ వీడియో 

అయితే, రుద్రపూర్‌లో జూపిటర్ ఆన్-రోడ్ ధర రూ.85210 ఉంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో 50 వేల రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఈ యువకుడు ఎలా చెల్లించాడు అనేది స్పష్టంగా లేదు.

ఒక వ్యక్తి నాణేలను నింపి వేలల్లో కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు చాలా సార్లు ఇలా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలతో పాటు.. ఇటీవల అస్సాంలో  ఒక వ్యక్తి తన పొదుపు డబ్బును గోనెలో నింపి, నాణేలను తీసుకుని స్కూటర్ కొనడానికి వచ్చాడు. అక్కడ ముగ్గురు-ముగ్గురు గోనె సంచిని ఎత్తుకుని మరీ షాప్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..