Snake vs Cat: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణసంకటం.. నెట్టింట్లో వీడియో వైరల్

Surya Kala

Surya Kala |

Updated on: Oct 27, 2022 | 11:07 AM

వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఓ పిల్లి, పాము కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో పిల్లి .. పాముని చూసి భయపడే బదులు.. ఎటువంటి భయం లేకుండా దానితో చెలగాటమారుతుంది.

Snake vs Cat: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణసంకటం.. నెట్టింట్లో వీడియో వైరల్
Snake Vs Cat Video Viral

పాములను చూసి భయపడని వారు బహు అరుదు. విషపూరితమైనవి అయినా, విష పూరితం కానివి అయినా సరే పాము అంటే చాలా వీలైనంత దూరం పరిగెడతారు. ఇవి అంటార్కిటికా మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో 2500 కంటే ఎక్కువ జాతుల పాములున్నా.. వీటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. పాములు చిన్న చిన్న కీటకాలను, కప్పలను తింటాయి. అయితే విషపూరితమైన పాముతో ఒక పిల్లి వీరోచితంగా పోరాడింది.  పిల్లి పోరాటానికి పాము చివరికి అక్కడ నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పిల్లికి పాముకి మధ్య పోట్లాట జరిగినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఒక వైపు.. ఓ పాము ఓ ఇంటి బయట నుంచి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాము దగ్గరగా రెండు పిల్లులున్నాయి. ఒక పిల్లి.. పాము వెళ్తుంటే.. దాని తోక మీద కొట్టి మరీ యుద్ధానికి పిలిచింది.  పాము పడగ విప్పి పిల్లి ని కాటు వేయడానికీ ప్రయత్నిస్తూనే ఉంది.. అయినప్పటికీ పిల్లి భయపడకుండా పాము తోకని కాళ్ల గోర్లతో కొట్టి మరీ దాడి చేసింది. చివరికి పాము ఆ పిల్లి దాడికి బయపడి.. తలని చుట్టుకుని కుదురుగా పడుకున్నా.. అప్పటికీ పిల్లి విడిచి పెట్టలేదు.. ఆ చుట్టుకున్న పాముపై మళ్ళీ దాడికి వెళ్లి.. కాళ్ల గోర్లతో గుచ్చింది. గాయపడిన పాము  అక్కడ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంది.

పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణసంకటం.. 

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఓ పిల్లి, పాము కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో పిల్లి .. పాముని చూసి భయపడే బదులు.. ఎటువంటి భయం లేకుండా దానితో చెలగాటమారుతుంది. పాము పై దాడి చేసింది. పాము కూడా తన విషంతో పిల్లిని భయపెట్టడానికి ప్రయత్నించింది. పిల్లిని భయపెట్టడానికి పాము కూడా తన వంతు ప్రయత్నించింది. అయినప్పటికీ పిల్లిపై పాము ప్రభావం చూపించలేదు. పాము పై నిరంతరం దాడి చేసింది. పోరాటం ముగిసే సమయానికి.. పాము ముడుచుకుని కూర్చుంది.

ఈ వీడియో beautifullanimalsdotcom అనే ఖాతా ద్వారా Instagramలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోను 36 వేల మందికి పైగా లైక్ చేయగా, లక్షలాది మంది ఈ వీడియోను చూశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu