Bowling Video: పట్టుదల ముందు వైకల్యం కూడా తలవంచదా.. వికలాంగుడి బౌలింగ్‌ను చూసి కలెక్టర్ కూడా ఫిదా

వైరల్ అవుతున్న వీడియోలో, నెట్స్‌లో ఒక వికలాంగుడు బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు.  బౌలర్ బ్యాట్స్‌మెన్ ను కట్టడి చేసేలా.. బౌలింగ్ చేశాడు.

Bowling Video: పట్టుదల ముందు వైకల్యం కూడా తలవంచదా.. వికలాంగుడి బౌలింగ్‌ను చూసి కలెక్టర్ కూడా ఫిదా
Handicap Man Bowling
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2022 | 8:53 AM

ప్రపంచంలో చాలా రకాల మనుషులు కనిపిస్తారు. ప్రతి చిన్న విషయానికి కొందరు కంగారుపడతారు.. మరి కొందరు పెద్ద కష్టం వచ్చినా కుంగిపోరు. మన చుట్టూ చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారి ప్రతిభను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ కొన్నిసార్లు అలాంటి కొన్ని వీడియోలు మన కళ్ల ముందు వస్తాయి. వాటిల్లో కొన్నిటిని చూస్తే.. ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత మీరు చేసే అభ్యాసం మిమ్మల్ని అసమర్థుల నుండి సమర్థులుగా చేయగలదని కూడా మీరు అర్థం చేసుకుంటారు.

క్రికెట్ మైదానంలో బౌలింగ్ చేయడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక బౌలర్ బ్యాట్స్‌మన్ కు తాను వేసే బౌలింగ్ తో అతని వికెట్ కోల్పోయే విధంగా లేదా అతను పరుగులు చేయలేని విధంగా బౌలింగ్ చేయాలి. అప్పుడే అతను మంచి బౌలర్ గా కీర్తించబడుతాడు. అయితే దీనికి మంచి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్‌లో మీకు బాగా కష్టపడినట్లు అయితే మీరు ఖచ్చితంగా ఇలా బౌలింగ్ చేయగలరు. అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో:

వైరల్ అవుతున్న వీడియోలో, నెట్స్‌లో ఒక వికలాంగుడు బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు.  బౌలర్ బ్యాట్స్‌మెన్ ను కట్టడి చేసేలా.. బౌలింగ్ చేశాడు. ఆ వ్యక్తి.. బౌలింగ్ చేస్తూ.. బంతిని బ్యాట్స్ మెన్ కొట్టలేని విధంగా బంతిని స్వింగ్‌ చేశాడు. వ్యక్తి ప్రతిభను చూసి క్రికెట్ ప్రియులతో సహా ఇతరులు  బౌలర్‌ను ప్రశంసిస్తున్నారు.

వీడియోపై వ్యాఖ్యానిస్తూ .. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ప్రేరణ కోసం మనం పెద్ద వ్యక్తులను ఎల్లప్పుడూ చూడవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు సాధారణ జీవితంలో కూడా మన ఆత్మను కదిలించే కొందరు వ్యక్తులు కనిపిస్తారు. ‘ ఈ వీడియో నిజంగా చాలా అద్భుతం అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు.. చాలా మంది ఇతర నెటిజన్లు అతడి ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..