AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girl Best Friend: కుక్కతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారి.. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆట చూస్తే వావ్ అనాల్సిందే..

వైరల్ అవుతున్న వీడియోలో.. వర్షం కురిసినట్లు ఉంది. రోడ్డు పూర్తిగా తడిగా కనిపిస్తోంది. అదే సమయంలో, ఒక చిన్నారి  రోడ్డుపై స్కిప్పింగ్ ఆడుతోంది. ఇక్కడ తమాషా ఏమిటంటే.. బాలిక తో పాటు జంటగా ఒక చిన్న కుక్క కూడా..

Girl Best Friend: కుక్కతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారి.. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆట చూస్తే వావ్ అనాల్సిందే..
Girl Dog Best Firends
Surya Kala
|

Updated on: Oct 25, 2022 | 12:17 PM

Share

కొన్ని రకాల జంతువులు, పక్షులను ప్రేమగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోండి. వాటిని మీరు ప్రేమిస్తే.. సొంత ఇంటి సభ్యుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తారు. జాగ్రత్తగా చూస్తాయి.. మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని అనుకరిస్తాయి కూడా.. ముఖ్యంగా కొన్ని పెంపుడు కుక్కలు మనుషులతో పాటు తిరుగుతూ, పరుగెత్తుతూ, దూకుతూ.. మరీ తెలివైనవి అంటే షాపింగ్ చేస్తూ ఉంటాయి. అయితే తన ఫ్రెండ్ తో పాటు స్కిప్పింగ్ ఓ రేంజ్ లో ఆడే కుక్కలను మాత్రం అరుదుగా చూస్తారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఒక చిన్నారి బాలిక తన కుక్క తో కలిసి స్కిప్పింగ్ ఆట ఆడుతుంది. వీరిద్దరి బంధం అందరినీ అలరిస్తోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా వెంటనే నవ్వేస్తారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. వర్షం కురిసినట్లు ఉంది. రోడ్డు పూర్తిగా తడిగా కనిపిస్తోంది. అదే సమయంలో, ఒక చిన్నారి  రోడ్డుపై స్కిప్పింగ్ ఆడుతోంది. ఇక్కడ తమాషా ఏమిటంటే.. బాలిక తో పాటు జంటగా ఒక చిన్న కుక్క కూడా తాడు దూకడం కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య సాగే అందమైన బందాన్ని  వీడియోలో చూడాల్సిందే. అమ్మాయి తాడును దూకే సమయానికి..  కుక్క కూడా చిన్నారిని అనుసరిస్తూ.. బాలికతో పాటు అదే సమయంలో తాడును దూకడం మీరు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

చాలా అందమైన ఈ వీడియో @myworld2121 హ్యాండిల్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  ‘అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌తో స్కిప్పింగ్ ఆడుతోంది అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. కేవలం 16 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌ని నెటిజన్లు  ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకి 60 వేల వ్యూస్ రాగా, 5 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు.. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో, చాలా మంది  రకరకాల కామెంట్స్ చేశారు. ఈ జంతువు పాప ఆనందానికి తోడుగా ఉందని ఒకరు, కుక్కని పెంపుడు జంతువుగా పెంచుకోవడానికి ఇదే కారణం అని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో