Watch Video: కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్.. ఎందుకంటే..
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు... మీరు వింటున్నది నిజమే.. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. ఆలయంలో పూజలు చేసి కొరడా దెబ్బలు తిన్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు… మీరు వింటున్నది నిజమే.. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. ఆలయంలో పూజలు చేసి కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. దీపావళి మరుసటి రోజు మంగళవారం ఉదయం.. దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో జరిగిన గోవర్ధన్ పూజలో భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. రాష్ట్రం సుభింగా ఉండాలంటూ ప్రార్ధించారు.
కాగా.. గోవర్ధన్ పూజలో భాగంగా జజన్‌గిరి గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పండగ రోజున గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని విఘ్నాలు తొలగిపోయి శుభం కలుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.. అంతేకాకుండా పూజ అనంతరం మంసాహారాన్ని సైతం ఆరగిస్తారు. వారి నమ్మకం ప్రకారం.. సీఎం భూపేశ్ భాగేల్ ఏటా అక్కడికి చేరుకుని.. పూజలు నిర్వహించి కొరడా దెబ్బలు తింటారు. ఈ ఏడాది కూడా గోవర్ధన్ పూజలో పాల్గొని సీఎం కొరడా దెబ్బలు తిన్నారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ జాజంగిరి గ్రామంలోని గౌరా-గౌరీ చేరుకున్న అనంతరం.. ఆలయానికి చెందిన వీరేందర్ ఠాకూర్ అనే వ్యక్తి సీఎం చేతిపై 5 కొరడా దెబ్బలు కొట్టారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ముఖ్యమంత్రి ఈ గౌర-గౌరీ పూజలో పాల్గొని.. రాష్ట్రం సుభిక్షంగా ప్రార్థించారు.
వీడియో చూడండి..
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped (sota) as part of a ritual on the occasion of ‘Gauri-Gaura Puja’ in Durg pic.twitter.com/avzApa8Ydq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 25, 2022
జాజంగిరికి చేరుకున్న ముఖ్యమంత్రి బాగేల్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022
ఈ వీడియోను సీఎం భూపేష్ బాఘేల్ కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం.. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..