నిషేధమున్నా క్రాకర్స్ కాల్చారు.. దెబ్బకు పడిపోయిన గాలి నాణ్యత.. ఆ లిస్టులో ఢిల్లీదే టాప్ ప్లేస్..
ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యం ముందు తేలిపోతున్నాయి. దీనంతటికీ కారణం.. ప్రభుత్వ సూచనలు ప్రజలు పెడచెవిన పెట్టడమేనని తెలుస్తోంది..

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. అవన్నీ ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యం ముందు తేలిపోతున్నాయి. దీనంతటికీ కారణం.. ప్రభుత్వ సూచనలు ప్రజలు పెడచెవిన పెట్టడమేనని తెలుస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచా కాల్చడంపై ఆప్ సర్కార్ నిషేధం విధించింది. కానీ నగరవాసులు ఈ ఆంక్షలను ఉల్లంఘించారు. దక్షిణ వాయువ్య ఢిల్లీతో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో సాయంకాలం నుంచే క్రాకర్లు కాల్చడం ప్రారంభించారు. దీంతో దీపావళి రాత్రి ఢిల్లీ NCR లో వాయు కాలుష్యం.. తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది.
ఢిల్లీ, నోయిడాల్లోని గాలి నాణ్యత పేలవమైన స్తాయికి చేరుకుంది. నిన్న ఉదయం 8 గంటలకు ఢిల్లీ AQI 301 గా నమోదు కాగా.. దీపావళి అర్ధరాత్రి వరకూ అత్యంత వరకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఎయిర్ స్టాండర్ట్స్ ఏజెన్సీలు అంటున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఢిల్లీలోగాలి నాణ్యత సూచిక AQI ఆదివారం నాడు.. 259గా నమోదయ్యింది. ఇది ఏడేళ్ల కనిష్ట స్థాయి. ఆదివారం జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించిన ఆనందంతో.. జనం భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు.
ఈ ఉత్సాహంతో దీపావళి నాడు మరింత ఎక్కువ క్రాకర్స్ కాల్చేశారు. దీంతో గాలి నాణ్యత మరింతగా పడిపోయింది. దీపావళి రోజున దేశ రాజధానిలో పటాకులు పేల్చితే.. ఆరు నెలల వరకూ జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ మంత్రి చెప్పినా సరే జనం చెవికెక్కించుకోలేదు. దీంతో ఇదీ పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత నిన్న రాత్రి దీపావళి తర్వాత మరింత దారుణంగా పడిపోయింది. 24 గంటల సగటు గాలి నాణ్యత సూచికలో 312గా నమోదయ్యింది.
ఇలా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం.. గత నాలుగేళ్లలో ఇది రెండో సారి. 2018లో దీపావళి తర్వాత ఢిల్లీ AQI 281 కాగా.. ఆ తర్వాత ఇదే అంతకన్నా మించి నమోదైన ఇప్పటికే స్విట్జర్లాండ్ కి చెందిన IQ Air సూచించిన దాని ప్రకారం ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రధాన నగరంగా నిలుస్తోంది. పాకిస్థాన్ కి చెందిన లాహోర్ తర్వాత ఢిల్లీ ఉండటం గమనార్హం. ఇక ప్రపంచ AQI వెబ్ సైట్ అయితే ఖతార్ తర్వాత అత్యధిక కాలుష్య నగరాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ది రెండో స్థానంగా చూపుతోంది. ఈ సూచీలో ఢిల్లీ ఉండటం విశేషం.