AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరికి ట్విస్ట్ అదిరిపోయిందిగా..

ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరూ.. ఎప్పుడు కూడా చూసి ఉండరు.. ఇద్దరు కొట్టుకుంటే.. మూడో వాడికి లాభం అన్నట్లు.. దీనిలో కూడా అదే సన్నివేశం కనిపిస్తుంది.

Watch Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరికి ట్విస్ట్ అదిరిపోయిందిగా..
Lions Fight Video
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2022 | 12:27 PM

Share

సోషల్ మీడియా ఒక వింతలకు వేదికగా మారుతూ ఉంటుంది. దీనిలో వైరల్ అయ్యే వీడియోలు.. ఫన్నీగా.. ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. సింహాలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో సింహాలు.. అడవి దున్నను వేటాడి గుప్పిట్లో తీసుకుంటాయి. అప్పుడే.. ఆడ సింహాలు ఎంటర్ అవ్వడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరూ.. ఎప్పుడు కూడా చూసి ఉండరు.. ఇది చూస్తే.. ఇద్దరు కొట్టుకుంటే.. మూడో వాడికి లాభం అన్నట్లు.. దీనిలో కూడా అదే సన్నివేశం కనిపిస్తుంది. మగ, ఆడ సింహాల భీకర పోరులో.. నీటి దున్న సింపుల్‌గా అడుగులో అడుగు వేసుకుంటు వెళ్తుంది. ఇలాంటి ఘటనలు.. మనుషుల మధ్య కూడా చూస్తుంటాం.. అయితే.. క్రూర మృగాల మధ్య కూడా రిపీట్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా సింహాలు.. కడుపు నింపుకునేందుకు భారీ జంతువును వేటాడుతాయి. ఇలాంటి సన్నివేశాలను తరచూ చూస్తుంటాం.. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, వేటాడిన తర్వాత సింహాలన్నీ స్వార్థపూరితంగా పోట్లాటకు దిగాయి. ఈ షాకింగ్ సీన్‌తో.. వాటి చేతికి అందిన ఆహారం.. నోటికి అందకుండా పోయింది. వైరల్ వీడియో.. సింహాల గుంపు మొదట అడవి దున్నను వేటాడుతాయి. ఈ క్రమంలో దానిని ఆరగించేందుకు రెడీ అవుతాయి. ఈ సమయంలోనే.. ఆడ సింహాలు అక్కడికి చేరుకుంటాయి. ఎర విషయంలో విషయంలో అవి ఘర్షణకు దిగుతాయి. మగ ఆడ సింహాల మధ్య భీకర పోరు జరుగుతుంది. అప్పటికే సింహాల దాడిలో గాయపడ్డ అడవి దున్న.. హాయిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడినుంచి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

సింహాలు వేట కోసం పోరాడుతున్న తీరును ఇప్పటివరకు చూడలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వైరల్ వీడియోను @OTerrifying అనే యూజర్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 4.5 మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిని లైక్ చేయడంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..