భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత హుండీ ఎత్తుకుని ఉడాయించాడు..
దొంగతనాలు చేయడం ప్రస్తుతం ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గతంలో మాదిరిగా ఒకే తరహా చోరీలు కాకుండా రకరకాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరూ చేయని విధంగా చోరీలు..
దొంగతనాలు చేయడం ప్రస్తుతం ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గతంలో మాదిరిగా ఒకే తరహా చోరీలు కాకుండా రకరకాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరూ చేయని విధంగా చోరీలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సంఘటనలు మనం చాలా చూశాం. విన్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగతనం గురించి వింటే మాత్రం మీరు అవాక్కవడం పక్కా. అందరిలా దొంగతనం చేస్తే తనకు వచ్చే గుర్తింపు ఏముంటుంది అనుకున్నాడో ఏమో.. దర్జాగా గుడిలోకి వెళ్లి పని కానిచ్చేశాడు. దొంగలు పలు రకాలు అన్నట్లు ఈ దొంగ చాలా వెరైటీ. పాపం వీడికి దేవుడంటే మహా భక్తి. అందుకే దీపావళి పండుగ సందర్భంగా దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాడు. దర్జాగా కారులో గుడికి వెళ్లాడు. దీప కాంతులతో, ఆథ్యాత్మిక శోభతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తులు అంతా దైవాన్ని కొలిచే పనిలో బిజీగా ఉన్నారు. మన దొంగ భక్తుడు కూడా గుడి దగ్గరకు వెళ్లి పద్ధతిగా చెప్పులు బయటపెట్టి ఆలయం లోపలికి వెళ్లాడు. తన ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్ధించాడు. ఇంతవరకూ బాగానే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ఆలయంలో భక్తులంతా దీపావళి సందడిలో ఉండగా ఇదే సరైన సమయం అనుకున్నాడు. తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. ప్లాన్ ప్రకారం గుడిలోని హుండీ ఎత్తుకుని అక్కడినుంచి పరారయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో గౌర్ చౌకీలోని హనుమాన్ దేవాలయానికి వెళ్లిన సదరు దొంగ దేవుడికి ఓ దణ్ణం పెట్టి, హుండీకే ఎగనామం పెట్టాడు. కాగా, గుడిలోని సీసీటీవీలో ఇదంతా రికార్డు అయ్యింది.
దీంతో హుండీ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీనే జరిగిందని పోలీసులు చెప్పారు.