Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhath Festival: పండక్కి ఇంటికి రావాలని ఉన్నా.. సెలవు లేదు.. రైల్లో చోటు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్న కార్మికుడు.. వీడియో వైరల్

ముఖ్యంగా పండగలు, పర్వదినం సందర్భంగా తమ ఉద్యోగులు అడిగిన వెంటనే సెలవులు ఇచ్చే  బాస్ లు చాలా తక్కువ మందే ఉన్నారు. మరోవైపు సెలవు దొరికినా రైలులోగానీ, బస్సులోగానీ అడుగు పెట్టలేని విధంగా రద్దీగా ఉంటున్నాయి.

Chhath Festival: పండక్కి ఇంటికి రావాలని ఉన్నా.. సెలవు లేదు.. రైల్లో చోటు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్న కార్మికుడు.. వీడియో వైరల్
Chhath Festival
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2022 | 10:41 AM

దేశవ్యాప్తంగా పండగలు, పర్వదినాల సందడి కొనసాగుతూనే ఉంది. దసరా, దీపావళి వంటి పర్వదినాలను జరుపుకుంటూనే ఉన్నారు. తాజాగా కార్తీక మాసం పూజలు మొదలయ్యాయి. అయితే పూజలకు, పర్వదినాలు ఉపయోగించే అనేక వస్తువుల తయారీ కంపెనీలు తమ తమ వస్తువుల తయారీతో బిజీబిజీగా ఉంటాయి.  ఫ్యాక్టరీలో చెమటలు కక్కుతూ పనిచేసే కార్మికుడు అయినా .. కార్పోరేట్ హౌజ్ లో కంప్యూటర్  విధులను నిర్వహించే ఉద్యోగి అయినా.. బాస్ మూడ్ చూసి తమకు సెలవు కావాలని అడగాల్సిందే. ముఖ్యంగా పండగలు, పర్వదినం సందర్భంగా తమ ఉద్యోగులు అడిగిన వెంటనే సెలవులు ఇచ్చే  బాస్ లు చాలా తక్కువ మందే ఉన్నారు. మరోవైపు సెలవు దొరికినా రైలులోగానీ, బస్సులోగానీ అడుగు పెట్టలేని విధంగా రద్దీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి తనకు సెలవు లేదు అంటూ బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తోన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. తన సమస్యను ఎవరు చెప్పుకోవాలని బాధపడుతున్నాడు.

రైలులో స్థలం, టికెట్ లేకపోవడంతో ఇంటి బాధ్యతను నెరవేర్చుకునేందుకు ఛత్ పర్వదినం రోజున కూడా ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తిరిగి రాలేకపోతున్నా అంటూ తన తల్లితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫ్యాక్టరీలో పని చేసే ఓ కార్మికుడు తన తల్లికి రైలులో ఖాళీగానీ, టిక్కెట్టుగానీ లేవని, ఈసారి నేను ఇంటికి రాలేనని చెబుతున్నాడు. అదే సమయంలో తాను ఫ్యాక్టరీలో చేస్తోన్న ఓవర్‌టైమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అందుబాటులో ఉంది. నేను త్వరలో ఇంటికి వస్తాను అని అతను తన తల్లికి హామీ ఇచ్చినట్లు ఉన్నాడు. కొడుకు.. తల్లికి తన బాధను చెబుతోన్న విధానం మనసుకు హత్తుకుంటుంది. ఈ  వీడియోపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు వీడియోపై భిన్న రకాల కామెంట్స్ ను చేస్తున్నారు. ఇతని బాధ పండుగను జరుపుకునే వారికే అర్థమవుతుందని ఒకరు తెలిపారు. అదే సమయంలో, ఈ వీడియో భావోద్వేగానికి గురిచేసిందని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..