Health: ఉపవాసానికి పద్ధతులున్నాయండోయ్.. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. భక్తికి భక్తి..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Oct 29, 2022 | 6:36 AM

పండుగలు, పర్వదినాలు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్న రోజుల్లో ఉపవాసం ఉండటం కామన్. కొందరు వారంలో ఏదో ఒక రోజు కచ్చితంగా ఫాస్టింగ్ ఉంటారు. కఠిన నియమాలు పాటిస్తారు. రోజంతా ఆహారం తీసుకోకుండా...

Health: ఉపవాసానికి పద్ధతులున్నాయండోయ్.. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. భక్తికి భక్తి..
Fasting Tips

పండుగలు, పర్వదినాలు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్న రోజుల్లో ఉపవాసం ఉండటం కామన్. కొందరు వారంలో ఏదో ఒక రోజు కచ్చితంగా ఫాస్టింగ్ ఉంటారు. కఠిన నియమాలు పాటిస్తారు. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉంటారు. మరికొందరు మాత్రం పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంపై చాలా మందికి అనేక సందేహాలున్నాయి. ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. దీని కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. డైట్ ప్లాన్ లో భాగంగా కడుపు కట్టుకోవడం, వ్యాయామాలు చేయడం సర్వసాధారణం. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, దేవునిపై భక్తితో చేసే ఒకే ఒక్క పని ఏదైనా ఉందంటే అది ఉపవాసం ఉండడమే. ఇది బరువు తగ్గడంలో ఉత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు వివిధ డైట్ ప్లాన్ పాటిస్తున్న వారిపై చేసిన అధ్యయనాల్లో బరువు తగ్గాలనుకునే వ్యక్తులు వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు కనిపించినట్లు గుర్తించారు. అంతే కాదు ఫలితం చాలా త్వరగా వస్తుందని నిర్ధారించారు. ఆహారం తీసుకునే విధానం కంటే ఏ సమయంలో తింటారు.. ఎంతసేపు ఆకలితో ఉండగలరు అనే విషయాలపై ఉపవాస నియమాలు ఆధారపడి ఉంటాయి.

ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంతే కాకుండా కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. దీంతో శరీరం బరువు తగ్గేందుకు చక్కగా సహాయపడుతుంది. అప్పుడప్పుడు ఉపవాసం చేసే ఈ పద్ధతిలో ఒక వ్యక్తి రోజుకు 16 గంటలు ఆకలితో ఉంటాడు. మిగిలిన 8 గంటల్లో పరిమిత పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. 5:2 డైట్ పద్ధతిలో, ఒక వ్యక్తి వారానికి 5 రోజులు సాధారణ ఆహార పదార్థాలను తీసుకుంటాడు. కానీ వారంలో రెండు రోజులు మాత్రం తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఇట్ స్టాప్ ఇట్ మెథడ్ లో వారానికి ఒకటి లేదా రెండు సార్లు 24 గంటల ఉపవాసం ఉంటుంది. ఒక రోజు భోజనం నుంచి మరుసటి రోజు ఉపవాసం వరకు 24 గంటలు కచ్చితంగా ఉపవాసం ఉండాలి. ప్రత్యామ్నాయ ఉపవాసం పద్ధతిలో బరువు తగ్గాలనుకునే వ్యక్తి ఒకరోజు ఉపవాసం ఉండి, మరుసటి రోజు ఆహార నియమాన్ని అనుసరిస్తాడు. అతను ఆహారం తినే రోజున కేవలం 500 కేలరీలు మాత్రమే తీసుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu