Tiger: ఆ జిల్లాలో పులి సంచారం.. పశువుల మందపై పంజా విసురుతున్న టైగర్‌

Subhash Goud

Subhash Goud |

Updated on: Oct 29, 2022 | 5:41 AM

ఈ మధ్య కాలంలో పులులు అటవీ ప్రాంతం నుంచి గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వస్తు్న్నాయి. పశువులపై దాడి చేస్తున్నాయి. దీంతో పశువుల కాపర్లు, గ్రామస్తులు భయాందోళన..

Tiger: ఆ జిల్లాలో పులి సంచారం.. పశువుల మందపై పంజా విసురుతున్న టైగర్‌
Tiger

ఈ మధ్య కాలంలో పులులు అటవీ ప్రాంతం నుంచి గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వస్తు్న్నాయి. పశువులపై దాడి చేస్తున్నాయి. దీంతో పశువుల కాపర్లు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పులుల సంచారంతో జనాలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇక తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఇదిగో పులి.. అదుగో పులి అన్న మాటలు తరచూ వినిపించేవి. అక్కడక్కడ కనిపించిన పులి పాదముద్రలను చూసిన స్థానికులు భయంతోనే బతుకీడ్చేవారు. ఇప్పటివరకు సంచారంతోనే సరిపెట్టుకుందనుకున్న పెద్దపులి.. పశువులపై పంజా విసరడంతో స్థానికులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ మధ్య అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి రెండు చోట్ల పశువుల మందపై పంజా విసిరింది. వారం వ్యవధిలో ఒక్కటికాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది పశువులను బలితీసుకుంది.

గిరిజాయ అటవీప్రాంతంలోని ఇంద్రనగర్‌లో.. పశువుల మందపై ఒక్కసారిగా విరుచుకుపడిన పులి ఆవును నోటకర్చుకుని వెళ్లిన విజువల్‌ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురికావాల్సిందే. పశువుల మందపై పులి విసిరిన పంజాను పశువుల కాపరులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయడంతో విషయం వెలుగుజూసింది. ఇప్పటివరకు సంచారానికే పరిమితమైందనుకున్న పులి.. పంజా విసరడం ప్రారంభించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రక్తం రుచి మరిగిన పులి ఏ క్షణాన తమ ఇళ్లపై దాడి చేస్తుందో తెలియక క్షణమొక యుగంలా బతుకీడుస్తున్నారు. అటవీ అధికారులు పెద్దపులిని బంధించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. మున్ముందు పులుల సంచారంపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు.

అటవీ అధికారుల నిఘా

ఇలా పులులు సంచరిస్తుండటంతో అటవీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పులులు సంచరిస్తుండటం, పశువుల మందపై దాడి చేసి చంపేస్తుండటంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంచరిస్తున్న పులులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu