Bharat Jodo Yatra: ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న రాహుల్..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ జనసందోహం నడుమ.. రాహుల్ శనివారం ఉదయం ధర్మాపూర్ వద్ద భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ జనసందోహం నడుమ.. రాహుల్ శనివారం ఉదయం ధర్మాపూర్ వద్ద భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ వెంట వస్తోన్న కార్యకర్తలు, అభిమానుల సందడితో పాదయాత్ర రూట్ కిక్కిరిసిపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇవాళ మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ వెంట CLP లీడర్ భట్టి విక్రమార్క, పలువురు నేతలు నడుస్తున్నారు. సాయంత్రం TPCC చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రలో జాయిన్ కానున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు.. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు సాగనుంది. ఈ సందర్భంగా రాహుల్ పలువురిని కలుస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై రాహుల్ గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..