Benefits of Jaggery: ఉదయాన్నే బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే చక్కెరకు బదులుగా బెల్లం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Benefits of Jaggery: ఉదయాన్నే బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Jaggery Health Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 27, 2022 | 8:59 AM

బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే చక్కెరకు బదులుగా బెల్లం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. బెల్లం తినడం వల్ల మీ బరువు అదుపులో ఉండటమే కాకుండా, అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. చలికాలం వస్తోంది.. కావున ఈ సమయంలో బెల్లం ఎక్కువగా వాడతారు. బెల్లం ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. కానీ.. శీతాకాంలో పలు సమస్యలను ఎదుర్కొనేందుకు ఎక్కువగా తీసుకుంటారు. కడుపు సమస్యలు, రక్తహీనత తదితర సమస్యలకు క్రమం తప్పకుండా బెల్లం తినడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. పరగడుపున లేదా ఉదయం పూట బెల్లం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. బరువు అదుపులో ఉంటుంది: జీర్ణక్రియ సంబంధిత సమస్యతో బాధపడుతుంటే బెల్లం తినడం మంచిదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కాకుండా పెరుగుతున్న బరువును నియంత్రించడానికి బెల్లం తినాలి.
  2. వ్యాధుల సంక్రమణ నుంచి రక్షిస్తుంది: బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా జీవక్రియ రేటును కూడా నియంత్రిస్తుంది. ఇది కాకుండా, గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లలో కూడా బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. ఐరన్ లోపం పోతుంది: ఐరన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా బెల్లం తినాలి, ఎందుకంటే ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు బెల్లంలో ఉంటాయి. ఇవి శరీరంలోని రైల్ బ్లడ్ సెల్స్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
  4. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా చాలా ఉపశమనం పొందుతారు. చలికాలం చాలా మంది కీళ్లనొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం బెల్లం తినాలి. ఉదయం పూట బెల్లం తింటే శరీరానికి ఎముకలకు బలం చేకూరుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. రక్తపోటు అదుపులో ఉంటుంది: బెల్లం ఇది రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇది శరీరంలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మీరు దీన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..