Health Tips: డ్రై ఫ్రూట్స్‌ని ఇలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఇప్పుడే తెలుసుకోండి..
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. అయితే వాటిని నానబెట్టి తినాలా? లేక నానబెట్టకుండా తినాలా?
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. అయితే వాటిని నానబెట్టి తినాలా? లేక నానబెట్టకుండా తినాలా? అనే పెద్ద ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఎవరి అభిప్రాయం ప్రకారం వారు లాగించేస్తుంటారు. కానీ, నిపుణుల సలహాలను అనుసరించి, డ్రై ఫ్రూట్స్ తింటే దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కూడా డ్రై ఫ్రూట్స్‌లోని పూర్తి పోషకాల ప్రయోజనాలను పొందాలనుకుంటే ఏ సమయంలో తినాలి, ఎలా తినాలి, డ్రై ఫ్రూట్స్‌ని ఎప్పుడు నానబెట్టాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్ ఎందుకు నానబెట్టాలి?
డ్రై ఫ్రూట్స్‌ను నీటిలో నానబెట్టడం వల్ల అవి మొలకెత్తుతాయి. వాటిలో పోషకాలు మరింత పెరుగుతాయి. వాస్తవానికి వాటి పై ఉండే తొక్కలు అనేక పోషకాలను లోపల నిక్షిప్తం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టినప్పుడు ఈ అవరోధం తొలగిపోతుంది. పోషకాలు, ముఖ్యంగా బి-విటమిన్లు బాగా శోషించబడుతుంది.
జీర్ణక్రియలో సహాయపడుతుంది..
డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్‌గా లేదా రోస్ట్ రూపంలో తింటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. నానబెట్టడం ఫైటేట్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అవి సులభంగా జీర్ణమవుతాయి. వాటిలో ఉండే ప్రోటీన్లు కూడా నానబెట్టడం వలన సగం జీర్ణం అవుతాయి. అందుకే డ్రై ఫ్రూట్స్‌ని రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే తినాలని సూచిస్తారు నిపుణులు.
డ్రై ఫ్రూట్స్‌ని ఇలా నానబెట్టాలి..
ఎండుద్రాక్ష, అత్తి పండ్లు, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్‌లను నానబెట్టే ముందు వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. కడగడం వల్ల వాటిని నిలువ చేయడానికి ఉపయోగించే రసాయనాలు క్లీన్ అవుతాయి. పప్పులు, కొన్ని తృణధాన్యాలను ముందుగా నానబెట్టినట్లే, డ్రై ఫ్రూట్స్‌ను కూడా నానబెట్టాలి. తద్వారా వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.
నానబెట్టకపోవడం వల్ల కలిగే నష్టాలివే..
1. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫైటిక్ యాసిడ్ కారణంగా.. అవి మీ జీర్ణశయాంతర ప్రేగులలో సమస్యలను కలిగిస్తాయి. 2. నానకపోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పేగులకు సరిగా అందవు. 3. వీటిలో ఉండే ఎంజైమ్ ఇన్హిబిటర్లు జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి. 4. నానబెట్టి తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ రుచి పెరగడమే కాకుండా వాటి పోషక విలువలు కూడా పెరుగుతాయి. 5. తినడానికి ముందు వాటిని శుభ్రమైన నీటితో కడగడం మర్చిపోవద్దు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..