Children Eye Care: మీ పిల్లల కంటి చూపు మెరుగవ్వాలా? ఈ 5 పదార్థాలు రోజూ తినిపించండి..
ప్రస్తుత కాలంలో చదువు, టీవీ, ఫోన్ కారణంగా పిల్లలు కంటి చూపు సమస్యతో సతమతం అవుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది.
ప్రస్తుత కాలంలో చదువు, టీవీ, ఫోన్ కారణంగా పిల్లలు కంటి చూపు సమస్యతో సతమతం అవుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది. ఫలితంగా కళ్లజోళ్లు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న వయసులోనే పిల్లల కంటి చూపు బలహీనంగా మారుతుంది. అయితే, పిల్లల్లో కంటి చూపు సమస్య తగ్గే బాధ్యత త్లలిదండ్రులపైనే ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లల కంటి చూపు సమస్యలను తగ్గించవచ్చంటున్నారు. ఒకవేళ పిల్లలకు ఇప్పటికే కళ్లద్దాలు వస్తే మాత్రం.. మంచి ఆహారం తినిపించడం వలన కంటి చూపును మళ్లీ బాగుచేసుకోవచ్చంటున్నారు.
కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. పిల్లలు గంటల తరబడి ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌లలో గడుపుతున్నారు. ఇది వారి కళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కళ్లు బలహీనంగా మారుతున్నాయి. ఫలితంగా కంటి చూపు మందగించి, కళ్లద్దాలు ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారంతో కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఫోన్, టీవీలకు కాస్త దూరం ఉండేలా ప్రయత్నించాలి.
రోజూ ఒక క్యారెట్.. పిల్లలకు రోజూ ఒక క్యారెట్ తినిపించాలి. ఇది మీ పిల్లల కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ.. పిల్లల కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్ తినడం వల్ల అద్దాలతో పని ఉండదు.
నేరేడె పండు.. నేరేడు పండులో మంచి పోషకాలు ఉంటాయి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నారింజ.. నారింజ పళ్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. నారింజ తినడం వల్ల కాల్షియం లోపం కూడా తగ్గుతంది.
బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీనిని రోజూ తినాలని సూచిస్తున్నారు నిపుణులు. విటమిన్ ఎ, విటమిన్ సి బొప్పాయిలో ఉంటాయి. దీనిని తినడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు.. కంటి చూపు కూడా మెరుగవుతుంది.
గుమ్మడికాయ గింజలు.. గుమ్మడికాయ, దాని గింజలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుమ్మడికాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా చేస్తుంది.