Lungs Care: ఈ వ్యాధులతో జర జాగ్రత్త.. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరితే ప్రమాదమంటున్న ఆరోగ్య నిపుణులు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 25, 2022 | 9:36 AM

ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు కరోనావైరస్.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మరింత బలహీనపరిచాయి. కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది.

Lungs Care: ఈ వ్యాధులతో జర జాగ్రత్త.. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరితే ప్రమాదమంటున్న ఆరోగ్య నిపుణులు..
Lungs

ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు కరోనావైరస్.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మరింత బలహీనపరిచాయి. కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కొంచెం నడవగానే చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్లు కూడా సరిగ్గా ఎక్కలేకపోతున్నారు. అయితే.. ఒక్క కరోనా వల్లనే ఊపిరితిత్తులు దెబ్బతినడం లేదని.. దానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో తీవ్రమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీని కారణంగా ఊపిరితిత్తులు నీటితో నిండిపోతాయని.. దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నీటి సమస్య దీర్ఘకాలం కొనసాగితే అది తీవ్రమవుతుంది. ఊపిరితిత్తుల వ్యాధి ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది జీవితకాల సమస్యగా మారొచ్చని హెచ్చిరిస్తున్నారు.

ఊపిరితిత్తులలో అసలు నీరు నిండుతుంది..

ఊపిరితిత్తులు తమ సొంత పని సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆ సామర్థ్యం ప్రభావితమవుతుంది. TB, న్యుమోనియా, లివర్ సిర్రోసిస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గ్రంధి క్యాన్సర్, కరోనా లేదా ఇతర రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులు నీటితో నిండిపోతాయి.

నీటిని గ్రహించే సామర్థ్యం 20 రెట్లు..

ఊపిరితిత్తుల ఎగువ ఉపరితలం నుంచి నీటి నిరంతర లీకేజ్ ఉంటుంది. ఛాతీ, దాని లోపలి గోడలు ఆ నీటిని పీల్చుకుంటూ ఉంటాయి. ఛాతీ లోపలి గోడలు దానిని గ్రహించేలా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల లోపలి గోడ 20 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలదు. ఊపిరితిత్తులు కూడా తమను తాము సమతుల్యం చేసుకోవడం ద్వారా నీటిని పీల్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు శరీరంలో ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా రకమైన వ్యాధి కారణంగా, ఛాతీలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. డాక్టర్ ను సంప్రదించండి.. 

ఇలాంటి సమయంలో శ్వాస వేగంగా మారుతుంది.. ఈ లక్షణం ద్వారా దీనిని గుర్తించవచ్చు. ఇంకా ఛాతీలో భారంగా ఉంటుంది. సాధారణ లక్షణాలు శ్వాసలో శ్లేష్మం, ఛాతీ నొప్పి, చెమటతో జ్వరం, వేగంగా బరువు తగ్గడం, కఫంతో రక్తం, శరీరంలో పలు భాగాల్లో వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu