Eye Health: కంటి చూపు తగ్గుతుందా..? అయితే.. ఈ ఐదు పదార్థాలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోండి..
డిజిటల్ యుగంలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో చాలా మంది..
డిజిటల్ యుగంలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో చాలా మంది.. ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లపైనే గడుపుతున్నారు. అయితే.. లాంటి జీవనశైలితో కంటి సంబంధిత సమస్యలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సాధారణంగా చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటిచూపు తగ్గడం లాంటి సమస్య ప్రతి పది మందిలో దాదాపు సగం మందిలో కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యవంతమైన కళ్ల కోసం.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. ఇది కంటి సమస్యలను మెరుగుపరుస్తుంది. అలాగే దృష్టి లోపాన్ని నివారించి.. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కావున కళ్ళు ఆరోగ్యంగా ఉండటంలో.. మీకు సహాయపడే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- గుడ్లు: లుటిన్, విటమిన్ ఎతో సహా గుడ్లలోని విటమిన్లు, పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు గుడ్డును తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు.. దీర్ఘకాలంలో వచ్చే కంటి చూపు సమస్యను సైతం నివారిస్తుంది. గుడ్లను మీకు నచ్చిన విధంగా లేదా ఉడికించి తినవచ్చు.
- సిట్రస్ పండ్లు: ఫింగర్డ్ సిట్రాన్ పండ్లు.. విచిత్రంగా కనిపించే పండ్లలో ఇవి కూడా ఒకటి.. దీనిని బుద్ధాస్ హ్యాండ్ అని కూడా పిలుస్తారు. ఇది కంటి ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రెటీనా కేశనాళికలను రక్షించడంలో సహాయపడుతుంది. కావున కంటి చూపును మెరుగుపరచడానికి దీన్ని తప్పనిసరిగా సిట్రస్ మీ ఆహారంలో చేర్చుకోవాలి.
- కారెట్లు: కారెట్లను రెగ్యులర్‌గా తింటే కంటి చాలా మేలు చేస్తుంది. క్యారెట్లను సలాడ్ గా లేదా ఏ రూపంలో తిన్నా కంటి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నాు. గుడ్డు సొనల మాదిరిగానే, క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కూడా ఉన్నాయి. ఇది కంటి ఇన్ఫెక్షన్‌లు, ఇతర తీవ్రమైన కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
- బాదం – తృణ ధాన్యాలు: కంటి ఆరోగ్యానికి విటమిన్ ఇ – ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌లు చాలా ముఖ్యమైనవి. ఈ పోషకాలు డ్రై ఫ్రూట్స్, బాదంలో పుష్కలంగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా లేదా.. రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు. ఇంకా మొలకలను కూడా డైట్‌లో భాగం చేసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
- చేపలు: మీరు మాంసాహార ప్రియులైతే.. సాధారణ చికెన్, రెడ్ మీట్ కంటే ఎక్కువగా సీఫుడ్‌ను తీసుకోండి.. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది. శాఖాహారం తీసుకునే వారు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను కూడా ఎంచుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..