Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colon Cancer: ఈ ఆహారపు అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి.. లేకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం

సరైన ఆహారం తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యువతలో పెద్దపేగు క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి అతి పెద్ద కారణం సరైన జీవనశైలి లేకపోవడం..

Colon Cancer: ఈ ఆహారపు అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి.. లేకపోతే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం
Colon Cancer
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2022 | 1:03 PM

సరైన ఆహారం తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యువతలో పెద్దపేగు క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి అతి పెద్ద కారణం సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆహారం కారణంగా కణాల సమూహాలు ఏర్పడతాయి. కణితి ఏర్పడుతుంది. మీరు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే అలాంటి అలవాట్లను మానేయడం మంచిదంటున్నారు నిపుణులు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు కారణమయ్యే విషయాలు తెలుసుకుందాం.

పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు:

జీర్ణక్రియలో సమస్య ఉంటే అది పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు. ప్రేగు కదలిక సమయంలో రక్తం ఉంటే ఇది కూడా కడుపు క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కడుపులో మంట, నొప్పి కూడా క్యాన్సర్ సంకేతం. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఇది కూడా కడుపు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. మీరు బరువు కోల్పోయి తక్కువ ఆకలి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు. జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ సమస్యలు రావచ్చు. తినే ఆహారంలో లోపాలు ఉన్న కారణంగా కూడా పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణం కావచ్చంటున్నారు. అలాగే మద్యపానం, ధూమపానం కూడా పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణమవుతాయి. మాంసాహారం, అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం క్యాన్సర్‌కు కారణమవుతుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. పిండితో కూడిన పదార్థాలు కడుపుకు చాలా హానికరం. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే మీరు త్వరలో ఈ క్యాన్సర్ బారిన పడవచ్చు. మార్కెట్ సమోసాలు, పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్ వంటి వేయించినవి క్యాన్సర్‌కు కారణమవుతాయి. అధిక పిండి పదార్ధాలు కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు. చాలా పిండి పదార్ధాలు పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలా రక్షించాలి:

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు కడుపు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే ఎక్కువ స్టార్చ్, కార్బోహైడ్రేట్లు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అంతే కాకుండా ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే పెద్దప్రేగు కాన్సర్ పరీక్ష చేయించుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి