Diwali 2022: కాలిన గాయాల చోట టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? ఇలాంటి తప్పుడు చేయకండి మరింత ప్రమాదం

దీపావళి పండగను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. ఇంటిని అలంకరించడమే కాకుండా, రుచికరమైన ఆహారపదార్థాలు, దుస్తులు, పటాకులు పేల్చడం లాంటివి చేస్తుంటారు..

Diwali 2022: కాలిన గాయాల చోట టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? ఇలాంటి తప్పుడు చేయకండి మరింత ప్రమాదం
Diwali 2022
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2022 | 8:17 AM

దీపావళి పండగను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. ఇంటిని అలంకరించడమే కాకుండా, రుచికరమైన ఆహారపదార్థాలు, దుస్తులు, పటాకులు పేల్చడం లాంటివి చేస్తుంటారు. సాధారణంగా దీపావళి రోజున అందరూ క్రాకర్స్ పేల్చుతారు. బాణాసంచా కాల్చడం అనేది సాధారణ విషయం.దీపావళి వేడుకల సమయంలో పటాకులు పేల్చేటప్పుడు చర్మం కాలిపోవడం వంటి సమస్యలు తరచుగా సంభవిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. కాలిన చర్మంపై టూత్‌పేస్ట్‌ను పూయడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం సరైంది కాదని చర్మ నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

క్రాకర్స్ వల్ల చర్మం కాలితే ఈ పనులు చేయకండి:

చర్మంపై కాలిన గాయం ఉంటే, దానిపై టూత్‌పేస్ట్ వేయడం చేయకూడదంటున్నారు వైద్య నిపుణులు. అందులో ఉండే కెమికల్స్‌ ప్రమాదమంటున్నారు. ఈ విధానం చర్మానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అంతే కాదు కూరగాయలను గ్రైండ్ చేయడం, అప్లై చేయడం వంటి ఇంటి నివారణలను కూడా ప్రయత్నించకుండా ఉండాలి. గాయంలో జెర్మ్స్ పేరుకుపోతాయి. వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

క్రాకర్స్ వల్ల లేదా మరేదైనా కారణాల వల్ల చిన్న పిల్లల చర్మం కాలిపోతే ఈ పరిస్థితిలో ఇంటి నివారణలు తీసుకోకుండా నేరుగా పిల్లల నిపుణుల వద్దకు తీసుకెళ్లండి. ఇంటి నివారణకు సంబంధించి పద్దతులను పాటిస్తే శిశువు చర్మానికి మరింత హాని కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మం కాలినప్పుడు ఇలా చేయండి

మీరు స్కిన్ బర్న్స్ కోసం ఇంటి నివారణలను అనుసరించాలనుకుంటే, అలోవెరా జెల్‌ను రాయండి. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ బాక్టీరియల్, ఇతర పదార్థాలు గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి.

చర్మంపై బొబ్బలు రాకుండా ఉండాలంటే వెంటనే తేనెతో రాయడం మంచిది. కాలిన ప్రదేశంలో తెనేతో పూయడం వల్ల త్వరగా నమం అవుతుంది. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేసి ఎప్పటికప్పుడు బ్యాండేజీని మార్చుకోవాలి. దీని వల్ల గాయాలు త్వరగా నమమవుతాయి. లేదా వైద్యున్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!