Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Party: దీపావళి పార్టీలకు వెళ్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఆ భయం ఉండదు..

భారతీయ సంప్రదాయంలో దీపావళి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు, లక్ష్మీ దేవికి పూజలు, స్వీట్లు.. ఇలా పండుగ..

Diwali Party: దీపావళి పార్టీలకు వెళ్తున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఆ భయం ఉండదు..
Liquor Party
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 24, 2022 | 9:29 PM

భారతీయ సంప్రదాయంలో దీపావళి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు, లక్ష్మీ దేవికి పూజలు, స్వీట్లు.. ఇలా పండుగ సందడంతా కనిపిస్తుంది. సంవత్సరంలో అతిపెద్ద పండుగ అయిన దీపావళి సీజన్ లో దుస్తులు, మేక్ ఓవర్ అయ్యేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పండుగ సందర్భంగా ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసుకోవడమో, లేక బయటి నుంచి తెప్పించుకోవడమో వంటివి చేస్తాం. టేస్టీ ఫుడ్స్ చూస్తే అస్సలు ఆగలేం. అందులోనూ మనకెంతో ఇష్టమైన స్వీట్స్ కనిపిస్తే నోట్లో నీళ్లూరిపోతాయి. ఆవురావురంటూ లాగించేస్తాం. కానీ ఎక్కువ తీపి ఉన్న పదార్థాలు చేసే హానిని మాత్రం కేర్ చేయం. అందుకే అతిగా కాకుండా పరిమితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో అతిగా తినడం నివారించే ఆలోచనల కోసం చూస్తున్నారా? దీపావళి పార్టీ లేదా ఏదైనా ఫంక్షన్ సమయంలో అతిగా తినడాన్ని నివారించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి పార్టీలో లేదా ఏదైనా ఫంక్షన్‌లో భాగం కావాలనుకుంటే బయలుదేరే ముందు ఒక ట్రిక్ ప్రయత్నించండి. పార్టీలో టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. వాటిని చూడగానే నోట్లో నీళ్లూరిపోతుంటాయి. వాటిని తినకుండా కంట్రోల్ చేసుకోలేం. అటువంటి పరిస్థితిలో పార్టీకి వెళ్ళే ముందే ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని కొంచెం తినాలి. ఈ ట్రిక్ ను ఫాలో అవడం ద్వారా పార్టీలో ఎక్కువగా తింటామన్న భయం ఉండదు. పార్టీకి వెళ్లే ముందు మీరు ఇంటి ఆహారాన్ని తినలేక పోయినట్లయితే పార్టీకి హాజరైన తర్వాత.. నూనె పదార్థాలు, ఫ్రైడ్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారానికి బదులుగా, మీరు సలాడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు.

కొన్ని పార్టీల్లో మద్యం కామన్ గా ఉంటుంది. అలాంటి వాటికి అటెండ్ అయ్యే సమయంంలో ముందుగా మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఎంత ఆల్కహాల్ తీసుకోవడం మీకు సరైనదని మీరు గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇది శరీర బరువును రెండు రెట్లు వేగంగా పెంచుతుంది. ఇలాంటివి శరీరంలో ఉండే పోషకాలపై కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి పార్టీకి వెళ్లే ముందు ఇలాంటి టిప్స్ ను ఫాలో అయితే.. దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి