Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping: ఎన్ని గంటలు నిద్రపోతున్నామనేది కాదు.. ఎంత నాణ్యమైన నిద్రను పొందుతున్నాం.. నిపుణులు ఏమంటున్నారంటే..

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా నిద్రపోయే వేళల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులలో ఈ సమస్య మరింత అధికంగా మారింది. లేట్ నైట్ ఆఫీస్ వర్క్, ఒత్తిడి, పార్టీలు..

Sleeping: ఎన్ని గంటలు నిద్రపోతున్నామనేది కాదు.. ఎంత నాణ్యమైన నిద్రను పొందుతున్నాం.. నిపుణులు ఏమంటున్నారంటే..
Sleeping
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 24, 2022 | 5:28 PM

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా నిద్రపోయే వేళల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులలో ఈ సమస్య మరింత అధికంగా మారింది. లేట్ నైట్ ఆఫీస్ వర్క్, ఒత్తిడి, పార్టీలు వంటి కారణాలతో నిద్రపోయే సమయాల్లో మార్పులు వచ్చాయి. అయితే శరీరానికి చాలినంత నిద్ర లేకపోతే తీవ్ర ఆరోగ్య పరిణామాలు ఉంటాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. నిద్ర లేకపోవడం అనేది అలసట లేదా మగతకు దారితీయవచ్చు. దీర్ఘకాలిక నిద్ర లేకపోవడం మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వివిధ శాస్త్రీయ అధ్యయనాలు నిద్ర అలవాట్లు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఊబకాయం, మెదడు పనితీరు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని కనుగొన్నారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాల ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పెద్దలు ప్రతి రాత్రి కనీసం 7-9 గంటలు నిద్రపోవాలి. పిల్లలు, యుక్తవయస్కులు వారి ఎదుగుదల అభివృద్ధి దశల్లో ఉన్నందున ఎక్కువ గంటలు విశ్రాంతి తీసుకోవాలి. 65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటల నిద్ర సరిపోతుంది.

ఎన్ని గంటలు నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎంత నాణ్యమైన నిద్రను మీరు పొందుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలసిపోయినట్లు అనిపిస్తున్న సందర్భాల్లో మనం నిద్రపోతున్న సమయంలో అప్పటికప్పుడు మేల్కొవడం, సరిగ్గా నిద్ర పట్టక పోవడం వంటివి జరుగుతుంటాయి. నిద్ర వివిధ దశలలో తగినంత సమయం గడపకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి రావచ్చు. నిద్ర చక్రం ప్రతి దశ వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన, రిఫ్రెష్ అనుభూతి కోసం అతి ముఖ్యమైన దశ గాఢంగా నిద్రపోయే దశ.

గాఢ నిద్ర అనేది నిద్ర దశ. ఈ దశలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కంట్రోల్ లో ఉంచుతుంది. మెదడు రోజంతా పేరుకుపోయిన రసాయన వ్యర్థాలనూ తొలగిస్తుంది. గాఢ నిద్ర మధ్యలో మేల్కొలపడం వల్ల గజిబిజిగా ఉంటారు. తగినంత గాఢ నిద్ర చక్రాలు పొందకపోవడం కూడా అంతే బాధాకరమైనది. మీ నిద్ర దశలు సాధారణంగా ఒక్కొక్కటి 90 నిమిషాల పాటు ఉండే ఆవర్తన చక్రాలలో సంభవిస్తాయి కాబట్టి.. మీరు గాఢ నిద్ర చక్రం చివరిలో మేల్కొనడానికి ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి