Side Effects of Onion: ఉల్లిపాయలను అతిగా తింటున్నారా.. ? అది మీ ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తుందో తెలుసా..?

ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధిక పరిమాణంలో ఉంటాయి. దాంతో పాటుగా ఇందులో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. కనుక..

Side Effects of Onion: ఉల్లిపాయలను అతిగా తింటున్నారా.. ? అది మీ ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తుందో తెలుసా..?
Onion
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 24, 2022 | 5:06 PM

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి.. ఎందుకంటే ఉల్లిపాయలో శరీరానికి ప్రయోజనాలు ఉండే అనేక రకాల పోషక విలువులుంటాయి. అన్ని వంటకాలలోనూ రుచి కోసం ఉల్లిపాయను తప్పక వినియోగిస్తుంటారు. దీంతో ఆహారం మరింత రుచిగా మారుతుంది. అయితే వీటిని తరచుగా తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో.. అన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహార అలెర్జీలు చాలా సాధారణం.. ఉల్లిపాయలతో సహా మరేదైనా ఆహారం కారణంగా అలెర్జీలు సంభవించవచ్చు. మీ రోగనిరోధక వ్యవస్థ కొన్ని ఆహారాలలో ప్రోటీన్లకు ప్రతిస్పందించినప్పుడు ఈ అలెర్జీలు సాధారణంగా సంభవిస్తాయి. ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధిక పరిమాణంలో ఉంటాయి. దాంతో పాటుగా ఇందులో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ సమస్య రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ గుండెల్లో మంటను గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) లక్షణంగా నిర్వచించింది.

ఉల్లిపాయను కోసేటప్పుడు మీకు ఎప్పుడైనా కళ్లలో నొప్పి అనిపించిందా? ఎందుకంటే ఉల్లిపాయను కత్తిరించడం వలన సల్ఫర్ మెటాబోలైట్ ఒక రూపం లాక్రిమేటరీ ఫ్యాక్టర్ (LF) విడుదల అవుతుంది. ఇది మీ కళ్ళకు చేరినప్పుడు, అది చికాకు, ఉల్లిపాయల కన్నీటి-ప్రేరేపిత ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉల్లిపాయతో నోటి దుర్వాసన కూడా ఆశ్చర్యం కలిగించే దుష్ప్రభావం. ఈ ఉల్లిపాయ అత్యంత సాధారణ, తక్షణ దుష్ప్రభావాలలో ఒకటి నోటి దుర్వాసన. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల నోరు తాత్కాలిక దుర్వాసన వస్తుంది. దీనిని వైద్యపరంగా హాలిటోసిస్ అంటారు. ముఖ్యంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవారు వీటిని తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలో రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచుతుంది. కావున డయాబెటిక్ పేషెంట్లు వీటిని తినకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి