AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: యానాంలో ఉద్రిక్తత.. రీక్రియేషన్ పేరుతో పేకాట క్లబ్బులు.. పోలీసుల ఆకస్మిక దాడులు

ఆ అప్పులు తీర్చేక్రమంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆన్ లైన్ రమ్మీపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

Andhra Pradesh: యానాంలో ఉద్రిక్తత.. రీక్రియేషన్ పేరుతో పేకాట క్లబ్బులు.. పోలీసుల ఆకస్మిక దాడులు
Yanam Police
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2022 | 9:39 PM

Share

యానాం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుట్టుచప్పుడు కాకుండా రీక్రియేషన్ పేరుతో పేకాట నిర్వహిస్తున్న క్లబ్బులపై దాడులు చేశారు యానాం పోలీసులు. దాడులు చేసేందుకు వచ్చిన పోలీసులను క్లబ్బు లోకి రాకుండా అడ్డుకునేందుకు సతవిధాల ప్రయత్నించారు నిర్వాహకులు. ఈసీన్ లో క్లబ్బు నిర్వాహకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్టకేలకు క్లబ్బులోకి ప్రవేశించిన పోలీసులు అక్కడ జరుగున్న విషయాలను బట్టబయలు చేశారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ రమ్మీని బ్యాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఇదే క్రమంలో పుదుచ్చేరి అసెంబ్లీ కూడా ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంటుందని ఆరాష్ట్ర హోమ్ మంత్రి నమశ్శివాయ చెప్పారు. రీక్రియేషన్ పేరుతో పేకాట క్లబ్బులను నిర్వహించడంపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యంలో చర్యలు తీసుకుంటామని గత రెండు రోజుల క్రితమే అనౌన్స్ చేశారు హోంమంత్రి నమశ్శివాయ.

ఆన్‌లైన్ రమ్మీకి వ్యసనమై కొంతమంది యువత తప్పుదోవపడుతున్నట్లు కంప్లైంట్ రావడంతో పుదుచ్చేరి గవర్నమెంట్ చర్యలు ప్రారంభించింది. ఆన్ లైన్ రమ్మీతో యువత అప్పులు పాలవుతున్నారని.. ఆ అప్పులు తీర్చేక్రమంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆన్ లైన్ రమ్మీపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది పుదుచ్చేరి ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి