నాలుగేళ్ల పెళ్లి 4 సెకన్లలో ముగింపు.. వాట్సాప్‌లో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ సందేశం పంపిన ఘనుడు.. ఆ తర్వాత..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 22, 2022 | 8:33 PM

భర్త కోపంతో మాట్లాడుతుండటం గమనించిన భార్య వెంటనే అతని ఫోన్ కట్ చేసింది. దాంతో భర్తనుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ఏంటని చూసిన ఆ ఇల్లాలు ఉలిక్కిపడింది.

నాలుగేళ్ల పెళ్లి 4 సెకన్లలో ముగింపు.. వాట్సాప్‌లో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ సందేశం పంపిన ఘనుడు.. ఆ తర్వాత..
Triple Talaq On Whatsapp

భారతదేశంలో ట్రిపుల్ తలాక్ నిషేధం. తలాక్ ద్వారా విడాకుల వ్యవస్థ ముగిసిపోయింది.. కానీ అక్కడక్కడ ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ నిషేధించబడినప్పటికీ, తాజాగా ఇలాంటి ఘటన వాట్సాస్‌ రూపంలో కనిపించింది. ఇదొక్కటే కాదు, ఈ తలాక్ కొత్త ఆధునికతకు తెరతీసినట్లుంది. ఈ కేసులో ప్రతిసారీ కట్నం తేవాలని భర్త తన భార్యతో గొడవపడేవాడు. గత ఏడాది కాలంగా ఆ ఇద్దరి మధ్య ఇదే వివాదం సాగుతోంది. ఇలా ఫోన్‌లో మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. భర్త కోపంతో మాట్లాడుతుండటం గమనించిన భార్య వెంటనే అతని ఫోన్ కట్ చేసింది. దాంతో భర్తనుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ఏంటని చూసిన ఆ ఇల్లాలు ఉలిక్కిపడింది. ఇది ట్రిపుల్ తలాక్ సందేశం. దాంతో ఆమె తిరిగి వెంటనే తన భర్త ఫోన్ చేసినా.. బదులు రాలేదు..పైగా మీ సంబంధం తెగిపోయిందంటూ భర్త కుటుంబ సభ్యులు బదులిచ్చారు. దీనిపై ఫిర్యాదు చేసిన భార్య న్యాయపోరాటం చేసింది. ఈ షాకింగ్‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని షాజమహల్ కాలనీకి చెందిన 27 ఏళ్ల ఇమా ఖాన్ 2018లో అబ్దుల్ రషీద్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత అబ్దుల్ రషీద్ మెల్లిగా తన నిజస్వరూపం బయటపెట్టడం మొదలుపెట్టాడు. వరకట్న వేధింపులు ప్రారంభించాడు. గతేడాది తన భార్య వస్తువులను ఉంచి, కొన్ని నగలు విక్రయించి, పని నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. 6 నెలల తర్వాత భార్యకు ఫోన్ చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ, సౌదీకి వెళ్లిన తర్వాత ఫోన్ కాల్స్ తగ్గాయి. వారానికోసారి ఫోన్ చేస్తే కట్నం తేవాలంటూ గొడవ మొదలుపెట్టాడు. దాచుకున్న బంగారు ఆభరణాలు ఇవ్వాలని హెచ్చరించాడు. 6 నెలల చిన్నారిని సౌదీ అరేబియాకు తీసుకెళ్తానని చెప్పిన భర్త.. తర్వాత కట్నం లేకుంటే నీతో జీవితం కష్టమని చెప్పాడు.

ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఫోన్‌లో గొడవలు జరిగి కాసేపటికి ఫోన్‌ సంభాషణ ముగిసింది. అబ్దుల్ రషీద్ సరికొత్త స్టైల్లో సందేశం పంపాడు. అతను పీడీఎఫ్ ఫైల్‌ను భార్య ఇమా ఖాన్‌కు పంపాడు. ట్రిపుల్‌ తలాక్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ను ఓపెన్‌ చేయడంతో భార్య కంగారుపడింది. దీనిపై మరోసారి అబ్దుల్ రషీద్ కు ఫోన్ చేస్తే కాల్ రిసీవ్ కావడం లేదు. దీంతో సంబంధాలు తెగిపోయాయని భర్త కుటుంబ సభ్యులు తెలిపారు.

తన భర్తకు గుణపాఠం చెప్పాలని ఇమా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేయబడింది. ఈ ఆచారం భారతదేశంలో లేదు. వరకట్నం ఆరోపణ కూడా ఫిర్యాదులో ఉంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటామని అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu