AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasivinda Plant : చెన్నంగి ఆకుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. వారికి అపర సంజీవని ఈ ఆకు పొడి..!

చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. చెన్నంగి ఆకులలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడీ నొప్పులను తగ్గిస్తుంది. ఈ ఆకుకూర వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

Kasivinda Plant : చెన్నంగి ఆకుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. వారికి అపర సంజీవని ఈ ఆకు పొడి..!
Chennangi Aaku
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2022 | 7:09 PM

Share

మనిషి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదాలు ఆకుకూరలు..! వాటిలో చెన్నంగి ఆకుకూర కూడా ఒకటి.. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు చెన్నంగి చెట్టు తెలియదంటే అతిశయోక్తి కాదు. చెన్నంగి ఆకు గ్రామీణ వైద్యానికి పెట్టింది పేరు..! జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి ఏదీ తినాలనిపించదు. ఏదీ తిన్నా కూడా నాలుకకు సహించదు..నోరంతా రుచిలేకుండా ఉంటుంది. ఇలాంటి సమస్యను చెన్నంగి ఆకు కూరతో చేసే పచ్చడి పొగోడుతుంది. చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. చెన్నంగి ఆకులలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడీ నొప్పులను తగ్గిస్తుంది. ఈ ఆకుకూర వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..!

ఎన్నో ఔష‌ధ‌ గుణాలున్న చెన్నంగిలో చిన్న క‌సివింద‌, పెద్ద క‌సివింద అని రెండు ర‌కాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు..చిన్న చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉండి మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌సివింద చెట్టు ర‌సం చేదుగా ఉండి వేడిని క‌లిగిస్తుంది. వాతాన్ని, విషాన్ని హ‌రించే శ‌క్తి ఈ క‌సివింద చెట్టుకు ఉంది. గాయాల‌ను, వ్ర‌ణాల‌ను, చ‌ర్మ రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

క‌సివింద చెట్టు ఆకుల‌ను వెన్న‌తో నూరి చ‌చ్చుబ‌డిన ప‌క్ష‌వాత భాగాల‌పైన ప్ర‌తిరోజూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. క‌సివింద ఆకుల‌ను, వేరు బెర‌డును ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడికి తేనెను క‌లిపి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, వ్ర‌ణాలు త‌గ్గుతాయి. క‌సివింద గింజ‌ల‌ను దోర‌గా వేయించి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని క‌షాయంలా చేసుకుని అందులో త‌గిన‌న్ని పాలు, కండ‌చ‌క్కెర క‌లిపి కాఫీ లా తాగుతూ ఉంటే స‌మ‌స్త మూత్ర రోగాలు త‌గ్గుతాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి