AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras-2022: ధన్‌తేరాస్‌ రోజున కొన్న కొత్త పాత్రలు, నాణేలతో ఖాళీగా ఇంట్లోకి ప్రవేశించడం అశుభం.. ఏం చేయాలంటే..

మీరు కూడా ధనత్రయోదశి రోజున కొత్త పాత్రలు లేదా బంగారు, వెండి నాణేలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వాటిని తీసుకుని, ఇంట్లోకి ప్రవేశించే సమయంలో మూడు వస్తువులలో ఒకదాన్ని మీ వద్ద ఉంచుకోండి. ఖాళీ పాత్రలు, నాణేలతో ఇంట్లోకి ప్రవేశించడం అశుభం. కాబట్టి..

Dhanteras-2022: ధన్‌తేరాస్‌ రోజున కొన్న కొత్త పాత్రలు, నాణేలతో ఖాళీగా ఇంట్లోకి ప్రవేశించడం అశుభం.. ఏం చేయాలంటే..
Good Fortune
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2022 | 7:37 PM

Share

సంప్రదాయం ప్రకారం ధన్‌తేరాస్ రోజును పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ధన్వంతరి పూజను భక్తిగా చేస్తే ఆ కుటుంబంలోని ప్రతీ ఒక్కరి వ్యాధులన్నీ నయమవుతాయని భావిస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇది అత్యంత శుభసూచిక సమయం కాబట్టి, వస్తువుల కొనుగోళ్లకు సరైన సమయమని ప్రజలు భావిస్తారు. చాలామంది బంగారం లేదా వెండి వస్తువులను కొనుక్కుంటారు. వాటికి పసుపు, కుంకుమ రాసి అమ్మవారి ప్రతిమ పాదాల చెంత ఉంచి సమర్పణ చేస్తారు. అనంతరం పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఆ తర్వాత వాటిని భద్రపరచుకుంటారు. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని, అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ రోజున ఇంట్లోకి ఖాళీ చేతులతో రాకూడదని మీకు తెలుసా..? మీరు కూడా ధనత్రయోదశి రోజున కొత్త పాత్రలు లేదా బంగారు, వెండి నాణేలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, వాటిని తీసుకుని, ఇంట్లోకి ప్రవేశించే సమయంలో మూడు వస్తువులలో ఒకదాన్ని మీ వద్ద ఉంచుకోండి. ఖాళీ పాత్రలు, నాణేలతో ఇంట్లోకి ప్రవేశించడం అశుభం. కాబట్టి గృహప్రవేశం సమయంలో తప్పనిసరిగా ఉండవలసిన మూడు విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

మీరు పాత్రలు కొంటున్నట్లయితే, ధనత్రయోదశి రోజున మీరు ఒకటి కాదు రెండు పాత్రలు కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. రెండింటినీ నీరు, స్వీట్లు లేదా ధాన్యంతో నింపండి. ఒక దానిని ధనత్రయోదశికి కొంటారు. మరొకటి దీపావళి నాడు లక్ష్మీ-గణేశ పూజ కోసం కొనాలి. వీటిలో ఏ ఒక్కటి కూడా వేయలేకపోతే తులసి ఆకును కూడా పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించవచ్చు.

ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనేటపుడు ఇంట్లోకి వచ్చేటపుడు మిఠాయిలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. కావాలంటే పంచదార, బెల్లం లేదా స్వీట్లు పెట్టుకోవచ్చు. అది సాధ్యం కాకపోతే తులసి ఆకులను తీసుకొని ఇంట్లోకి ప్రవేశించండి.

ఇవి కూడా చదవండి

ధనత్రయోదశి రోజున మీరు షాపింగ్ చేసి ఇంటికి రాగానే ఏడు రకాల ధాన్యాలు తెచ్చుకుంటే మీ ఇంటికి అన్నం, ఐశ్వర్యం, అదృష్టానికి లోటుండదు. ఈ ఏడు ధాన్యాలలో బార్లీ, తెల్ల నువ్వులు, బియ్యం, గోధుమలు, కరివేపాకు, జొన్నలు లేదా పొట్టు తియని మినపప్పు, మిల్లెట్, బియ్యం వెంట తెచ్చుకోవాలిన శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి