AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: టోల్‌ప్లాజా వద్ద యువకుల రచ్చ .. ఆలస్యమైందంటూ వాగ్వాదం.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్..

అసలే యువకులు.. ఉరకలేస్తున్న ఉడుకు రక్తం.. అందులోనూ మిత్రుల బృందం.. ఇంకేముంది రచ్చ రచ్చే.. మాకెవ్వడు అడ్డు అంటూ పెద్ద ఇష్యూనే క్రియేట్ చేశారు.

Tirupati: టోల్‌ప్లాజా వద్ద యువకుల రచ్చ .. ఆలస్యమైందంటూ వాగ్వాదం.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్..
Vadamalapeta Toll Plaza
Shiva Prajapati
|

Updated on: Oct 22, 2022 | 8:50 PM

Share

Tirupati: టోల్‌ప్లాజా వద్ద యువకుల రచ్చ .. ఆలస్యమైందంటూ వాగ్వాదం.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్..

అసలే యువకులు.. ఉరకలేస్తున్న ఉడుకు రక్తం.. అందులోనూ మిత్రుల బృందం.. ఇంకేముంది రచ్చ రచ్చే.. మాకెవ్వడు అడ్డు అంటూ పెద్ద ఇష్యూనే క్రియేట్ చేశారు. అలాగని స్థానికులు కానే కాదు.. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి తిరుపతిలోని వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద పరిస్థితిని కాసేపు ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ రచ్చకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి వడమాలపేట టోల్‌ప్లాజా దగ్గర కొందరు విద్యార్థుల అత్యుత్సాహంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారి తప్పు ఇతరులపై నెట్టి ఘర్షణ వాతావరణం సృష్టించారు. చివరికి పోలీసుల ఎంట్రీతో పరిస్థితి సద్దుమణిగింది.

తిరుపతి నుంచి చెన్నైకి కొందరు కొందరు తమిళనాడు లా స్టూడెంట్స్ వెళ్తున్నారు. వారు సరిగ్గా వడమాలపేట టోల్ ప్లాజా వద్దుకు వచ్చారు. అయితే, వాళ్ల వెహికిల్స్‌కి ఉన్న ఫాస్ట్‌ ట్యాగ్‌లు పనిచెయ్యలేదు. దాంతో టోల్ చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. ఫలితంగా టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలర్ట్ అయిన టోల్‌ప్లాజా సిబ్బంది.. ట్రాఫిక్ జామ్ అవుతోందని, త్వరగా టోల్ చెల్లించాలని కోరారు. దాంతో రెచ్చిపోయిన యువకులు.. టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. దాడికి తెగబడ్డారు విద్యార్థులు.

ఇవి కూడా చదవండి

వీరి అత్యుత్సాహం కారణంగా గంటకు పైగా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దాంతో సహనం కోల్పోయిన వాహనదారులు, స్థానికులు.. ఆ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా వారిపైనా దురుసుగా ప్రవర్తించారు. టోల్ సిబ్బంది, వాహనదారులపై దాడి చేశారు. లాస్టూడెంట్స్ కు ఇతర వాహనదారుల మధ్య జరిగిన గొడవ 3 కార్ల అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘర్షణపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసులు వారి స్టైల్‌లో ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో విద్యార్థులు తోక ముడిచారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పరిస్థితి సద్దుమణిగింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..